బస్సు ప్రమాదంలో లేడీ టెక్కీ మృతి, హైదరాబాద్ వెళ్తూ

బెంగళూర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న వోల్వో బస్సు అదుపు తప్పి బోల్తా కొట్టింది. ప్రమాదంలో రమ్యతో పాటు హైదరాబాద్‌కు చెందిన హరీష్ కుమార్, పద్మ, ప్రదీప్ తీవ్రంగా గాయపడ్డారు. వీరిని గుత్తి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రమ్య మరణించింది.
ఇదిలావుంటే, అనంతపురం జిల్లాలోని బెలుగప్ప మండలం ఎస్. గుండ్లపల్లి సమీపంలో మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. ఆగి ఉన్న నీటి ట్యాంకర్‌ను ఐషర్ వ్యాన్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. ప్రమాదంలో గాయపడిన మరో ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications