వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీ గ్యాంగ్ రేప్: పోలీసు వైఫల్యంపై ఉషా మెహ్రా విచారణ

By Pratap
|
Google Oneindia TeluguNews

Usha Mehra
న్యూఢిల్లీ: వైద్య విద్యార్థిని సామూహిక అత్యాచారం ఘటనలో పోలీసు వైఫల్యంపై ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఉషా మెహ్రా విచారణ చేపట్టనున్నారు. అత్యాచార బాధితురాలి వాంగ్మూలం రికార్డు విషయంలో పోలీసుల జోక్యంపై సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ ఫిర్యాదుపై కూడా ఆమె విచారణ జరుపుతారు. ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్‌కు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఉషా మెహ్రాతో కేంద్ర ప్రభుత్వం ఏకసభ్య కమిషన్‌ను నిరయమించింది.

అత్యాచార బాధితురాలి వాంగ్మూలాన్ని రికార్డు చేసే విషయంలో పోలీసులు జోక్యం చేసుకున్నారని వచ్చిన ఆరోపణలపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని షీలా దీక్షిత్ షిండేకు రాసిన లేఖలో కోరారు. బాధితురాలి వాంగ్మూలానికి, పోలీసుల కథనానికి మధ్య పొంతన లేదని సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ ఫిర్యాదు చేశారు.

ఢిల్లీ ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం పరువు కోసం పాకులాడుతున్న నేపథ్యంలో సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ ఆరోపణలను తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఉషా మెహ్రా చండీఘడ్‌లోని పంజాబ విశ్వవిద్యాలయం నుంచి బిఎ, ఎల్ఎల్‌బి పట్టా తీసుకున్నారు. ఢిల్లీలో హైకోర్టు రిజిస్ట్రార్‌గా ఆమె 1984లో నియమితులయ్యారు. ఢిల్లీ హైకోర్టు రిజిస్ట్రార్‌గా నియమితులైన తొలి మహిళ ఆమె. 1990లో ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు.

ఇదిలావుంటే, అత్యాచార బాధితురాలి ఆరోగ్యం మరింత క్షీణించింది. రక్తస్రావం జరుగుతున్నట్లు వైద్యులు చెప్పారు. శరీరంలో రక్తస్రావం జరగడం సోమవారం రాత్రి నుంచి ప్రారంభమైందని వైద్యులు చెప్పారు. అయితే, ప్లేట్‌లెట్ కౌంట్స్ మాత్రం పెరిగాయని చెప్పారు. బ్లడ్ ఇన్‌ఫెక్షన్ జరిగితే అవయవయాలు చచ్చుపడే ప్రమాదం ఉందని వైద్యులు అంటున్నారు. ఆమె ఇంకా వెంటిలేటర్‌పైనే ఉన్నట్లు చెప్పారు.

English summary
Justice Usha Mehra, a former judge of Delhi High court, will investigate the police lapses in the case of the gangrape of a 23-year-old medical student in Delhi on December 16 and also into the Sub Divisional Magistrate's complaint of police interference while recording the rape survivor's statement.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X