న్యూఇయర్: లేడీస్‌హాస్టల్లోకి యువకులు, డ్రగ్స్‌పట్టివేత

న్యూఇయర్ వేడుకల్లో ఆకతాయిలు
నూతన సంవత్సర వేడుకల్లో పలువురు ఆకతాయిలు రెచ్చిపోయారు. కర్నూలు జిల్లాలో ఈ ఘటన జరిగింది. కొత్త సంవత్సరం నేపథ్యంలో ముగ్గురు యువకులు మద్యం సేవించి, ఆ మత్తులో అర్ధరాత్రి సమయంలో మెడికల్ కాలేజి లేడీస్ హాస్టల్‌లోకి చొరబడ్డారు. హాస్టల్‌లోని యువతులతో అసభ్యంగా ప్రవర్తించారు.
హాస్టల్ వార్డెన్ వెంటనే అప్రమత్తమయ్యాడు. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. హాస్టల్ వార్డెన్ ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. ముగ్గురిలో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మిగిలిన ఇద్దరి కోసం గాలిస్తున్నారు. ఈ ఘటన బుధవారపేటలో జరిగింది.
గుంటలో పడి ముగ్గురు మృతి
మెదక్ జిల్లా హత్నూరు మండలం తురకల ఖానాపూర్ హాస్టల్‌లో నీటిగుంటలో పడి ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.












Click it and Unblock the Notifications