తన సమస్య పరిష్కరించుకోలేడు కానీ: జగన్‌పై బొత్స

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఒకరిద్దరు పార్టీ ప్రతినిధులు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వెళ్లినంత మాత్రాన తమ పార్టీకి వచ్చే నష్టమేమీ లేదన్నారు. కృష్ణా జిల్లాకు చెందిన కాంగ్రెసు నాయకులు ఎవరు కూడా వైయస్ జగన్మోహన్ రెడ్డి పార్టీలో చేరరని చెప్పారు. తెలంగాణపై తమ పార్టీ అధిష్టానం నిర్ధిష్టమైన ప్రకటన చేస్తే తాము దానికి తప్పకుండా కట్టుబడి ఉంటామని చెప్పారు.
ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగానే కాంగ్రెసు పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందన్నారు. కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే తెలంగాణ సమస్యకు త్వరలో పరిష్కారం చూపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రం విడిపోవడానికి, కలిసి ఉండటానికి ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలకు తావులేదని చెప్పారు. తెలుగుదేశం పార్టీ ఊసర వెల్లి రాజకీయాలకు పాల్పడుతోందని ఆయన మండిపడ్డారు.
ప్రాంతాల వారిగా ప్రజలను టిడిపి మభ్యపెడుతోందన్నారు. వైయస్ జగన్ అధికారం కోసమే పాకులాడుతున్నారని ధ్వజమెత్తారు. తన సమస్యలను పరిష్కరించుకోలని జగన్ జనం సమస్యలని పరిష్కరిస్తారంటే నమ్మాలా అన్నారు. మజ్లిస్ పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ వ్యాఖ్యలు సరికాదన్నారు. ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా మతోన్మాదం రెచ్చగొట్టేలా మాట్లాడటం చట్టరీత్యా నేరమన్నారు.












Click it and Unblock the Notifications