షర్మిల నాటకాలు, జగన్‌ను తరిమికొట్టండి: నటి కవిత

పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న వస్తున్నా మీకోసం పాదయాత్ర స్ఫూర్తితో నియోజకవర్గ సమస్యలపై పిఠాపురం ఇంచార్జ్ వర్మ పాదయాత్ర ముగిసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. అరవై మూడేళ్ల వయస్సులో ప్రజల కోసం చంద్రబాబు చేస్తున్న పాదయాత్రతో ప్రధాన రాజకీయపక్షాలన్ని బేంబేలెత్తిపోతున్నాయన్నారు.
కాళ్లకు గాయాలవుతున్నా, వేళ్లు పుండ్లు పడినా ఎంతో శ్రమకు ఓర్చి చంద్రబాబు పాదయాత్ర చేస్తున్నారని తెలిపారు. చంద్రబాబును చూసి పాదయాత్రకు దిగిన వైయస్ జగన్ సోదరి షర్మిల కాలికి గాయమైందని నాటకాలు ఆడుతూ ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నదని ఏద్దేవా చేశారు.
మద్యం బెల్టుషాపులు తొలగించాలని టిడిపి కోటి సంతకాల సేకరణ ఉద్యమం చేపడితే జగన్ విడుదల కోసం వైయస్సార్ కాంగ్రెస్‌పార్టీ కోటి సంతకాలు సేకరణ చేపట్టిందని ఆమె విమర్శించారు. కోటిమంది సంతకాలతో సరిపెడితే రాష్ట్రంలో మిగిలిన ఏడుకోట్ల ప్రజలు వ్యతిరేకించినట్టు కాదా అని ఆమె ప్రశ్నించారు.
ఎంతో నమ్మకం పెట్టుకొని ప్రజారాజ్యం పార్టీని నెగ్గిస్తే వారి నమ్మకాన్ని వమ్ము చేస్తూ చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్‌లో కలిపి వేసి ప్రజలను మోసగించారని ధ్వజమెత్తారు. జగన్‌పై కేసులు ఎత్తివేయడం కోసం వైయస్సార్ కాంగ్రెసు పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసేందుకు ఎప్పుడో ఒప్పందం కుదిరిందని ఆరోపించారు.












Click it and Unblock the Notifications