హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మేం రెడీ: మజ్లిస్‌పై వెంకయ్య, కేసు పెట్టాలి: కూనంనేని

By Srinivas
|
Google Oneindia TeluguNews

Venkaiah Naidu-Kunamneni Sambasiva Rao
హైదరాబాద్: హిందువుల పైన, హిందూ దేవతల పైన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన మజ్లిస్ పార్టీ శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీని ఇప్పటి వరకు అరెస్టు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం పిరికిపందలా వ్యవహరిస్తోందని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు సోమవారం మండిపడ్డారు. పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. మజ్లిస్ నేతలు దేశ సార్వభౌమాన్ని ప్రశ్నించేలా మాట్లాడారన్నారు.

అలాంటి నేత పైన ప్రభుత్వం ఉదాసీనతగా ఎందుకుందని ప్రశ్నించారు. మజ్లిస్ పార్టీ బిజెపిని రాజకీయంగా ఎదుర్కోవాలే తప్ప శ్రీరాముడు, శ్రీకృష్ణుడుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. దేవతల పైన ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ హిందువులకు తాము వ్యతిరేకం కాదని చెప్పడం విడ్డూరమన్నారు. మజ్లిస్‌ను ఎదుర్కొనేందుకు బిజెపి రెడిగా ఉందన్నారు. బిజెపికి వ్యతిరేకమంటే పార్టీని విమర్శించండి. కానీ దేవతలను కించపరిస్తే ఊరుకునేది లేదన్నారు. మజ్లిస్ నేతలు రజాకారుల వారసులని విమర్సించారు.

అక్బరుద్దీన్ వ్యాఖ్యలను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల బిజెపి ర్యాలీలు, ఆందోళనలు నిర్వహించింది. ఆయన దిష్టి బొమ్మల్ని దగ్ధం చేసింది. హైదరాబాదులోని తార్నాక, మొజంజాహీ మార్కెట్, కాచిగూడ, కూకట్‌పల్లి తదితర ప్రాంతాల్లో ఆందోళన నిర్వహించింది. పోలీసులు కొన్ని చోట్ల లాఠీఛార్జ్ చేశారు. నిర్మల్‌లో బిజెపి బందుకు పిలుపునిచ్చింది. పోలీసు స్టేషన్‌ను ముట్టడించేందుకు ప్రయత్నించింది.

ఎథిక్స్ కమిటీ భేటీ

అసెంబ్లీలో సోమవారం ఉదయం ఎథిక్స్ కమిటీ సమావేశమయింది. ఈ సమావేశంలో కూనంనేని సాంబశివ రావు అక్బరుద్దీన్ అంశాన్ని లేవనెత్తారు. హిందూ దేవతలను కించపర్చేలా మాట్లాడిన అక్బరుద్దీన్ పైన చర్యలు తీసుకోవాలన్నారు. సామాన్యులపై ఎలాంటి కేసులు పెడతామో అతని పైనా అలాంటి కేసులే పెట్టాలన్నారు. దీనిపై స్పీకర్‌కు ఫిర్యాదు చేయాలని ఎథిక్స్ కమిటీ నిర్ణయించింది.

విద్యుత్ ఛార్జీలపై వెంకయ్య మండిపాటు

ఇంత భారీగా విద్యుత్ ఛార్జీలు దేశంలో ఎక్కడా పెంచాలనే నిర్ణయాలు రాలేదని వెంకయ్య నాయుడు అన్నారు. కాంగ్రెసు పార్టీ మరణశాసనాన్ని తానే లిఖించుకుంటోందన్నారు. కాంగ్రెసు పార్టీ అసమర్థత వల్లే పెంపు అన్నారు.

English summary
BJP senior leader Venkaiah Naidu has lashed out at MIM and Kiran Kumar Reddy government on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X