మంత్రుల్లో భరోసా: తెలంగాణపై కావూరి, కేసు నిలువదు

మంత్రుల కమిటీ సానుకూలం స్పందన
కొల్లేరు అంశంపై మంత్రుల కమిటీ సానుకూలంగా స్పందించిందని కావూరి సాంబశివ రావు చెప్పారు. అందుకే తాము తమ ఆందోళనను తాత్కాలికంగా విరమించుకున్నట్లు చెప్పారు. సబ్ కమిటీ సానుకూల స్పందన వల్లనే తాను తదుపరి కార్యాచరణ తీసుకోలేదని ఆయన చెప్పారు. కొల్లేరు ప్రాంత భూముల పరిహారంపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో తాను చర్చించానని చెప్పారు.
ఇటీవల తన పైన అటవీ శాఖ అధికారులు పెట్టిన కేసులు చట్టపరంగా నిలువవన్నారు. ఐదో కాంటూరు ఎగువన ఉన్న చెరువులను ధ్వంసం చేయడం సరికాదన్నారు. చెరువులను ధ్వంసం చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదన్నారు. ముఖ్యమంత్రితో మాట్లాడానని, సబ్ కమిటీ సానుకూలంగా స్పందించిందని... అయితే సమస్య పరిష్కారం కాకుంటే మాత్రం తాను తిరిగి ఉద్యమిస్తానని కావూరి చెప్పారు.
కాగా కావూరి సాంబశివ రావు పైన నాలుగు రోజులక్రితం కేసు నమోదయిన విషయం తెలిసిందే. కావూరి కొల్లేరు వన్యప్రాణి చట్టం అతిక్రమించారని అటవీశాఖ అధికారులు ఆరోపించారు. కోమటిలంక రోడ్డు వివాదంలో ఆయనపై ఈ కేసును నమోదు చేశారు. ఆదివారం రాత్రి కావూరి కొల్లేరు గట్టుపై రోడ్డు వేసేందుకు ప్రయత్నించారు. అతనిని రెవెన్యూ, ఫారెస్టు అధికారులు అడ్డుకున్నారు.












Click it and Unblock the Notifications