హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్సార్ ఎస్టేట్: రిపుంజయ్ ఆస్తులు రూ. 75 కోట్లు

By Pratap
|
Google Oneindia TeluguNews

ACB
హైదరాబాద్: ఎపిపిఎస్‌సి సభ్యుడు కె. రిపుంజయ్ రెడ్డికి దాదాపు 75 కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులు ఉన్నట్లు అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) అధికారులు గుర్తించారు. ఈ మేరకు శనివారం మీడియాలో వార్తలు వచ్చాయి. అతనికి 25 కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులతో పాటు వైయస్సార్ ఎస్టేట్ కింద కొనుగోలు చేసిన 32 ఎకరాల భూములు ఉన్నట్లు ఎసిబి అధికారులు గుర్తించారు. రిపుంజయ్ రెడ్డి ఆదాయానికి మించిన ఆస్తుల విలువ మార్కెట్ ధర ప్రకారం 75 కోట్ల రూపాయలు ఉంటాయని అంటున్నారు.

రిపుంజయ్ రెడ్డిని ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఎసిబి అధికారులు డిసెంబర్ 26వ తేదీన అరెస్టు చేశారు. తన వేతనంతో, జెఎన్‌టియు ఫ్యాకల్టీ సభ్యురాలైన తన భార్య వేతనంతో గత ఐదేళ్లుగా తాను ఆస్తులు కొనుగోలు చేసినట్లు రిపుంజయ్ రెడ్డి చెప్పాడు. దీంతో అతని పిల్లలు, భార్య, తల్లిదండ్రులకు సంబంధించిన రిజిస్ట్రేషన్ వివరాలో కోసం ఎసిబి అధికారులు హైదరాబాద్, రంగారెడ్డి, బెంగళూర్, కడప, చిత్తూరు జిల్లాల్లోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో తనిఖీలు చేయాలని నిర్ణయించుకున్నారు.

కడప జిల్లాలోని రాయచోటి, చిత్తూరు జిల్లాలోని పీలేరు, వాయల్పాడుల్లో 32 ఎకరాల భూమి ఉన్నట్లు ఎసిబి అధికారులు గుర్తించారు. అలాగే బెంగళూర్‌లోని అనేకల్‌లో ఆరు ఎకరాల భూమి ఉన్నట్లు కనిపెట్టారు. హైదరాబాదులోని మాదాపూర్, కొండాపూర్‌ల్లో జి+4 అపార్టుమెంట్లు ఉన్నట్లు కూడా ఎసిబి అధికారులు గుర్తించారు. రిపుంజయ్ రెడ్డి భార్య రమాదేవి పేరు మీద ఉన్న కరూర్ వైశ్యా బ్యాంక్ జూబ్లీహిల్స్ శాఖలోని లాకర్‌ను తెరిచి, 1.5 కిలోలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. రమాదేవి జెఎన్‌టియులో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.

కడప జిల్లాలోని గుట్లపల్లి, రాయచోటిల్లో, చిత్తూరు జిల్లాలోని రేణిగుంటలో 36 ఎకరాల వ్యవసాయ భూములు, వాటితో పాటు ఐదు ప్లాట్లు, ఆరు ఫ్ల్టాట్లు హైదరాబాదులో ఉన్నట్లు ఎసిబి అధికారులు డిసెంబర్ 26వ తేదీన జరిపిన తనిఖీల్లో కనిపెట్టారు. ఎసిబి అధికారులు 63 తులాల బంగారం, 3.5 కిలోల వెండి, 12 లక్షల విలువ చేసే రెండు కార్లు, 30.5 లక్షల ఎఫ్‌డి ఉన్నట్లు కూడా తేలింది.

తన, తన భార్య వేతనంతోనే ఆస్తులన్నీ కొనుగోలు చేసినట్లు రిపుంజయ్ రెడ్డి ఎసిబి అధికారుల విచారణలో చెప్పారు ఆయన నెలసరి వేతనం లక్ష రూపాయలు కాగా, ఆయన భార్య నెలసరి వేతనం 70వేల రూపాయలు. తన ఆస్తుల వివరాలను కూడా ఆయన ఎసిబి అధికారులకు వివరించారు.

English summary
According to media reports - Anti-Corruption Bureau (ACB) sleuths have unearthed Rs 25 crore worth assets, including 32 acres of farm land christened 'YSR Estate' belonging to APPSC member K Ripunjaya Reddy since his arrest on December 26.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X