అక్బరుద్దీన్‌పై వ్యాఖ్యలు: స్వామి కమలానంద అరెస్టు

అక్బరుద్దీన్ వ్యాఖ్యలను నిరసిస్తూ ఈ నెల 9వ తేదీన హైదరాబాదులోని ఇందిరా పార్కు వద్ద కమలానంద భారతి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కమలానంద భారతి అరెస్టును విశ్వ హిందూ పరిషత్ (విహెచ్‌పి) ఖండించింది. ఆయన అరెస్టుకు నిరసనగా ఆందోళనాకార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది.
విశ్వ హిందూ పరిషత్ నేత స్వామి కమలానంద భారతిని పోలీలులు అరెస్టు చేయడాన్ని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామచంద్రరావు ఖండించారు. మజ్లీస్ పార్టీని సంతృప్తి పరచడానికి కమలానంద భారతిని అరెస్టు చేశారని ఆయన ఆరోపించారు. కమలానందపై తప్పుడు కేసులు నమోదు చేయడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
అక్బరుద్దీన్ ద్వేషపూరిత ప్రసంగాన్ని నిరసిస్తూ విశ్వ హిందూ పరిషత్ ఈ నెల 9వ తేదీన హైదరాబాదులోని ఇందిరాపార్కు వద్ద నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమంలో కమలానంద భారతి ప్రసంగిస్తూ అక్బరుద్దీన్ ఓవైసీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.












Click it and Unblock the Notifications