వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైబ్రాంట్‌లో పాకిస్తాన్‌కు మోడీ నో: తిప్పి పంపిన వైనం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Narendra Modi
అహ్మదాబాద్/న్యూఢిల్లీ: వైబ్రాంట్ గుజరాత్ సమ్మిట్‌లో పాల్గొనేందుకు వచ్చిన పాకిస్తాన్ బృందాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం వెనక్కి పంపారు. అలా చేయడం ద్వారా మోడీ కేంద్ర ప్రభుత్వానికి కూడా గట్టి షాక్ ఇచ్చారు. ఇటీవల మూడు రోజుల పాటు వైబ్రాంట్ గుజరాత్ సమ్మిట్ జరిగింది. ఇందులో పాల్గొనేందుకు వివిధ దేశాల నుంచి అధికారులు, వాణిజ్య ప్రముఖులతో కూడిన బృందాలు వచ్చాయి. అందులో పాకిస్తాన్ కూడా ఉంది.

22 మందితో కూడిన ఓ పాక్ బృందం గుజరాత్‌కు వచ్చింది. అయితే అత్యంత గౌరవంగా పాకిస్థాన్ బృందాన్ని వైబ్రెంట్ గుజరాత్ సదస్సు నుంచి తిప్పి పంపారు. నియంత్రణ రేఖ వద్ద ఉద్రిక్తతలు నెలకొనడంతో మోడీ ప్రభుత్వం పాక్ బృందాన్ని వెంటనే గుజరాత్ వదిలి వెళ్లాల్సిందిగా కోరింది. అయితే, ఈ విషయంపై వ్యాఖ్యానించేందుకు మాత్రం గుజరాత్ సర్కారు నిరాకరించింది. అంతేకాదు.. ప్రారంభ కార్యక్రమానికి హాజరు కావాల్సిన ఈ బృందాన్ని అక్కడకు కూడా రాకుండా అహ్మదాబాద్‌లోని హోటల్ గదిలోనే ఉంచేశారు.

కాగా పాకిస్థానీ బృందం వైబ్రెంట్ గుజరాత్ సదస్సుకు ముందు జరిగిన అమ్మకందారులు - కొనుగోలుదారుల సమావేశంలో పాల్గొందని గుజరాత్ పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి మహేశ్వర్ సాహూ తెలిపారు. సదస్సులో భాగంగానే ఈ సమావేశం కూడా జరిగిందని, అందులో పాల్గొనేందుకే పాక్ బృందం వచ్చిందని, గాంధీనగర్‌లో 11, 12 తేదీల్లో జరిగిన ప్రధాన సదస్సులో పాల్గొనలేదని హోం శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌కే నందా వివరించారు. వారికి అహ్మదాబాద్ వరకే వీసాలున్నాయని, కొందరికి సూరత్‌కు కూడా వీసా ఉండటంతో అక్కడకు వెళ్లారని తెలిపారు.

మరోవైపు రెండు రోజుల క్రితం పాకిస్తాన్ మరోసారి బరితెగించిన విషయం తెలిసిందే. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్తాన్ మరోసారి ఉల్లంఘించింది. అంతకుముందు ఇద్దరు జవాన్ల తలలు నరికి పాకిస్తాన్ తన పాశవిక చర్యను బయట పెట్టుకుంది. ఆ తర్వాత ఇలా పలుమార్లు ఉల్లంఘనలకు పాల్పడుతోంది.

బిజెపి ప్రశ్న

నియంత్రణ రేఖ వద్ద ఉద్రిక్తలు పెరుగుతున్నా ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నోరు మెదపడం లేదని భారతీయ జనతా పార్టీ విమర్శించింది. కాశ్మీరులోని మెంధార్ సెక్టారులో ఇద్దరు భారత సైనికులను పాకిస్తాన్ చంపినా ప్రధాని మౌనంగా ఉన్నారని, రాజ్యసభలో విపక్ష నేత అరుణ్ జైట్లీ విమర్శించారు.

English summary
Despite his extensive exercise of image makeover to shed ultra saffron hue which had led Narendra Modi to reach out to the business community from Pak, it did not take much for him to restrain the 22 member of Pak delegation from attending the Vibrant Gujarat Global Summit(VGGS) 2013.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X