ఆదిలాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏదో ఆవహించింది, బుక్ ప్రేరేపిచింది: అక్బరుద్దీన్

By Pratap
|
Google Oneindia TeluguNews

Akbaruddin Owaisi
ఆదిలాబాద్: నిర్మల్‌లో ప్రసంగిస్తున్నప్పుడు తనను ఏదో ఆవహించిందని మజ్లీస్ శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ పోలీసుల విచారణలో అన్నట్లు బుధవారం వార్తలు వచ్చాయి. పోలీసుల విచారణలో అక్బరుద్దీన్ ఏమీ చెప్పలేదని తొలుత వార్తలు వచ్చాయి. అయితే, ఆయన పోలీసు విచారణలో పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించినట్లు బుధవారం సాయంత్రం వార్తలు వచ్చాయి.

ఓ పుస్తకం తనను ఆ ప్రసంగం చేయడానికి ప్రేరేపించిందని ఆయన పోలీసులకు చెప్పినట్లు సమాచారం. నిర్మల్ ప్రసంగానికి సంబంధించి తనదిగా చెబుతున్న సిడీలోని గొంతు తనది కాదని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో గొంతును పోల్చుకోవడానికి ఆ ప్రసంగం సిడీని, శాసనసభలో అక్బరుద్దీన్ చేసిన ప్రసంగాన్ని పరీక్షల నిమిత్తం పోలీసులు పంపించారు.

కాగా, అక్బరుద్దీన్ ఓవైసీకి జనవరి 22వ తేదీ వరకు జ్యుడిషియల్ కస్టడీ విధిస్తూ ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ కోర్టు బుధవారం ఆదేశాలు జారీ చేసింది. ద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణపై అరెస్టయిన అక్బరుద్దీన్‌కు జనవరి 12 నుంచి 16వ తేదీ వరకు కోర్టు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. అయితే, ఈ నెల 17వ తేదీ వరకు కోర్టు ఆయనను పోలీసు కస్టడీకి పంపించింది. అయితే ఓ రోజు ముందుగానే పోలీసులు ఆయనను కోర్టులో ప్రవేశపెట్టారు.

ఇదిలావుంటే, తనను ప్రత్యేక ఖైదీగా గుర్తించాలని అక్బరుద్దీన్ దాఖలు చేసుకున్న పిటిషన్‌పై నిర్మల్ మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టు బుధవారం సానుకూలంగా స్పందించింది. అక్బరుద్దీన్‌ను ప్రత్యేక ఖైదీగా గుర్తిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అక్బరుద్దీన్‌కు ప్రత్యేక ఆహారం, ప్రత్యేకమైన దుస్తులు ఇవ్వాలని నిర్మల్ మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టు బుధవారం జైలు అధికారులను ఆదేశించింది.

English summary
According to media reports - MIM MLA Akbaruddin Owaisi has agreed his mistake regarding Nirmal hate speech.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X