ఆదిలాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సింఘాల్: అక్బర్ మెడకు మరో ఉచ్చు, సంగారెడ్డి కోర్టుకి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Akbaruddin Owaisi
హైదరాబాద్: హిందువులు, హిందూ దేవతలతో పాటు జాతి సమైక్యతను దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు చేశారనే అభియోగాలతో అరెస్టై అదిలాబాద్ సబ్ జైలులో ఉన్న మజ్లిస్ పార్టీ శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ మెడకు మరో ఉచ్చు బిగుసుకుంది. 2005లో అక్బరుద్దీన్ ఓవైసీ ఓ అంశానికి సంబంధించి అప్పటి జిల్లా కలెక్టర్ సింఘాల్‌ను, జాయింట్ కలెక్టర్‌ను దూషించారనే అభియోగాలపై కేసు నమోదైంది.

ఈ కేసుకు సంబంధించి అక్బరుద్దీన్ అప్పట్లో ఓసారి సంగారెడ్డి కోర్టుకు హాజరయ్యారు. మళ్లీ హాజరు కాలేదు. అయితే పటాన్‌చెరు పోలీసులు ఇప్పుడు ఆ కేసును తిరగదోడారు. బుధవారం పోలీసులు సంగారెడ్డి కోర్టులో పిటీ వారెంట్ దాఖలు చేశారు. అక్బరుద్దీన్‌ను ఇక్కడకు తీసుకు వచ్చి విచారించేందుకు అనుమతించాలని కోరారు. రేపు అక్బరుద్దీన్‌ను పోలీసులు సంగారెడ్డి కోర్టులో హాజరు పర్చనున్నారు.

2005లో పటాన్‌చెరు ముత్తంగి రోడ్డు విస్తరణలో భాగంగా ప్రార్థనా మందిరాన్ని తొలగించినందుకు యత్నించిన అధికారులను ఓవైసీ సోదరులు అడ్డుకున్నారని కేసు నమోదయింది. కలెక్టర్‌ను, జెసిని అక్బర్ దుర్భాషాలాడారు. వారిపై 163ఏ, 147, 149, 341 సెక్షన్ల క్రింద పోలీసులు అప్పట్లో కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి అక్బర్ ఓసారి కోర్టుకు హాజరయ్యారు. ఆ తర్వాత హాజరు కాలేదు.

అక్బర్ మరోసారి కోర్టుకు రాకపోవడంతో వారెంట్ పెండింగులో ఉంది. ఇప్పుడు వివాదాస్పద వ్యాఖ్యల కేసులో అక్బరుద్దీన్ అరెస్టు కావడంతో పటాన్‌చెరు పోలీసులు పాత కేసును తిరగదోడారు. పోలీసుల పిటీ వారెంట్‌తో ఈ నెల 17న మెదక్ తీసుకు వచ్చేందుకు కోర్టు అంగీకరించింది. దీంతో రేపు అక్బర్‌ను తీసుకు వచ్చేందుకు మెదక్ జిల్లా పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. నాటి కేసులో అక్బరుద్దీన్ ఎ1గా, అసదుద్దీన్ ఎ2గా ఉన్నారు.

రెండున్నరేళ్ల క్రితం నలుగురు మజ్లిస్ ఎమ్మెల్యేలు కోర్టులో లొంగిపోయారు. ఇప్పటి వరకు 24 మంది ఈ కేసుకు సంబంధించి అరెస్టయ్యారు. ఓవైసీ సోదరులు పరారీలో ఉన్నట్లు పోలీసులు చూపారు.

English summary

 Patancheru police opened old case against MIMLP Akbaruddin Owaisi on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X