చార్మినార్ నిజాం జాగీర్ కాదు: మజ్లిస్ ఖాద్రీపై జగ్గారెడ్డి

Jagga Reddy
హైదరాబాద్/మెదక్: చార్మినార్, అసెంబ్లీ, తాజ్ మహల్, ఎర్రకోట తమవే అన్న మజ్లిస్ పార్టీ శాసనసభ్యుడు పాషా ఖాద్రీ పైన ప్రభుత్వ విప్, సంగారెడ్డి శాసనసభ్యుడు తూర్పు జయప్రకాశ్ రెడ్డి శుక్రవారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అసెంబ్లీ, చార్మినార్ తదితర కట్టడాలు తాము కట్టించినవన్న ఖాద్రీ వ్యాఖ్యలు బాధాకరమన్నారు. ఇలాంటి వ్యాఖ్యల్ని ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. అవి వారి సొంతమేమీ కాదని ప్రజల సొమ్ముతో కట్టినవన్నారు.

మాదని చెప్పేందుకు ఇది మజ్లిస్, రజాకార్ల జాగీర్ కాదన్నారు. నిజాం జాగీర్ అంతకంటే కాదన్నారు. ప్రజల సొమ్ముతో కట్టారన్నారు. మరోసారి ఇలాంటి ప్రకటనలు చేస్తే ఖబర్దార్ అన్నారు. ఖాద్రీ పైన కేసు నమోదు చేసి భవిష్యత్తులో ఇలాంటి ప్రకటనలు చేయకుండా చూడాలన్నారు. భారత దేశానికి స్వాతంత్రం తీసుకు రావడానికి పోరాటం చేసిన జాతిపిత మహాత్మా గాంధీ మీద మాట్లాడటం విడ్డూరమన్నారు.

మహాత్ముడి పైన మాట్లాడినందుకు తక్షణమే ప్రభుత్వం స్పందించి ఆయనపై కేసు పెట్టి చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. మహాత్ముడిపై వ్యాఖ్యలు చేసినందుకు దేశ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే తీవ్రపరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. నిజాం నిర్మించిన అసెంబ్లీ భవనంలో గాంధీ విగ్రహాన్ని ఎందుకు పెట్టారంటూ ఎంఐఎం నేత బాషా ఖాద్రీ జాతిపితను అవమానించారన్నారు. డిజిపి చర్యలు తీసుకోవాలన్నారు.

కాగా సంగారెడ్డి మండలం కందిలో వాహనాల దగ్ధం కేసులో తూర్పు జయప్రకాశ్ రెడ్డి ఈ రోజు కోర్టులో హాజరయ్యారు. ఎక్సైజ్ ప్రథమ శ్రేణి న్యాయమూర్తి మారుతీ దేవి ఎదుట ఆయన హాజరయ్యారు. కేసు ఏప్రిల్ 2వ తేదికి వాయిదా పడింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+