మన కోటలు బీటలు వారుతున్నాయి: సోనియా

పార్టీని బలోపేతం చేయడానికి, భాగస్వామ్య పక్షాలను గౌరవించడానికి మధ్య సమతుల్యత సాధించాలని ఆమె సూచించారు. పిల్లలు, యువతులపై వేధింపులను అరికట్టాలని ఆమ సూచించారు. పార్టీ బలాలు, బలహీనతలపై ఆత్మపరిశీలన చేసుకోవాలని ఆమె అన్నారు. కొత్త తరహా సవాళ్లు మన ముందు ఉన్నాయని, వాటిని సమర్థంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని అన్నారు.
గత 9 ఏళ్ల కాలంలో పార్టీ ఎన్నో సవాళ్లను ఎదుర్కొందని, దేశం ఎదుర్కుంటున్న సవాళ్లపై ప్రత్యేక శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉందని సోనియా అన్నారు. ఆర్థికాభివృద్ధి, సామాజిక సామరస్యం ఒకే నాణేనికి బొమ్మా బొరుసు వంటివని అన్నారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు మనం సిగ్గుపడాలని అన్నారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను విస్మరిస్తే పార్టీకే నష్టమని అన్నారు. మహిళల సాధికారితకు పలు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
పాకిస్తాన్‌తో మన దేశం జరిపే చర్చలు నాగరిక సమాజం ఆమోదించే రీతిలో ఉండాలని ఆమె సూచించారు. భూమి కోసం, నీటి కోసం జరుగుతున్న పోరాటాలను తక్కువవ చేసి చూడకూడదని అన్నారు. 2014 ఎన్నికలే లక్ష్యంగా చింతన్ శిబిర్ సాగనుంది. గెలుపు దిశగా పార్టీని నడిపించేందుకు అవసరమైన వ్యూహాలను ఈ సదస్సులో రూపొందిస్తారు. ఐదు ప్రధానమైన అంశాలపై సదస్సులో చర్చ జరగనుంది. పెరుగుతున్న మధ్య తరగతిని రాజకీయ ప్రక్రియకు దూరంగా ఉంచకూడదని ఆమె సూచించారు.
జైపూర్ చింతన్ శిబిరంలో సోనియా గాంధీతో పాటు ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధీ, తదితర కాంగ్రెసు సీనియర్ నేతలు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications