జగన్‌పై లగడపాటికి విహెచ్: కెవిపి ఇంటి వద్ద పహారా

లగడపాటికి దమ్ముంటే జగన్ కనువిప్పు యాత్ర చేపట్టాలన్నారు. బాబు తెలంగాణ జిల్లాల్లో పాదయాత్ర చేసినప్పుడు అక్కడ కనిపించిన ప్రజల భావోద్వేగాలు, ఆత్మహత్యలను చూసి తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చారని విహెచ్ చెప్పారు. అలాంటి చంద్రబాబుకు కనువిప్పు అంటూ లగడపాటి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ఆయనకు దమ్ముంటే పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని, యువనేత రాహుల్ గాంధీని జగన్ విమర్శించినప్పుడు ఎందుకు స్పందించలేదన్నారు.
కెవిపి నివాసం వద్ద పోలీసుల పహారా
కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత కెవిపి రామచంద్ర రావు ఇంటి వద్ద సోమవారం పోలీసులు మోహరించారు. బంజారాహిల్సులోని ఏడో నెంబరు రహదారిలోని ఆయన ఇంటిని తెలంగాణ న్యాయవాదులు ముట్టడించనున్నారనే సమాచారం అందడంతో పోలీసులు ఆయన ఇంటి వద్ద గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు.
కెవిపి నివసిస్తున్న దుర్గా పామ్ అపార్టుమెంటులోనికి వెళ్లేందుకు వీలులేకుండా ఇనుప ముళ్లకంచెతో దారిని మూసేశారు. మధ్యాహ్నం మూడు గంటలకు తెలంగాణ న్యాయవాదులు అక్కడకు వస్తారని ప్రచారం జరిగింది. అయితే నాలుగు గంటల వరకూ ఎవరూ రాకపోవడంతో పోలీసులు వెనుదిరిగారు.












Click it and Unblock the Notifications