ఉండవల్లి జై ఆంధ్రప్రదేశ్ సభకు మంత్రులు, ఎమ్మెల్యేలు

జై ఆంధ్ర స్మృతులను ఆయన గుర్తు చేసుకున్నారు. మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, కాసు వెంకటకృష్ణా రెడ్డి, రఘువీరా రెడ్డి, వట్టి వసంత కుమార్, గంటా శ్రీనివాస రావు, శైలజానాథ్, పసుపులేటి బాలరాజు తదితరులు హాజరయ్యారు. పార్లమెంటు సభ్యులు కెవిపి రామచందర్ రావు, లగడపాటి రాజగోపాల్, రాయపాటి సాంబశివరావు, జెడి శీలం, హర్షకుమార్ తదితరులు హాజరయ్యారు. పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కూడా హాజరయ్యారు.
శాసనసభ్యులు గాదె వెంకటరెడ్డి, వంగా గీత, బండారు సత్యానందరావు, మల్లాది విష్ణు, తోట త్రిమూర్తులు, అవంతి శ్రీనివాస్, విజయకుమార్, కన్నబాబు, కొత్తపల్లి సుబ్బరాయుడు, యలమంచిలి రవి, చింతలపూడి తదితరులు హాజరయ్యారు. ఎమ్మెల్సీలు కూడా పలుపురు హాజరయ్యారు.
ఉండవల్లి అరుణ్ కుమార్ జై ఆంధ్ర ఉద్యమ పూర్వపరాలను వివరించారు. తాను ఉండవల్లి మిత్రుడిగా మాత్రమే సభకు వచ్చానని, పిసిసి అధ్యక్షుడిగా రాలేదని బొత్స సత్యనారాయణ సభకు ముందు చెప్పారు. తాము ఈ సభ ద్వారా సమైక్య గళం వినిపిస్తామని రాయలసీమకు చెందిన మంత్రి శైలజానాథ్ చెప్పారు. తనతో కలిసి జై ఆంధ్ర ఉద్యమంలో పాల్గొని జైలుకు వెళ్లిన మిత్రులను కూడా ఉండవల్లి అరుణ్ కుమార్ వేదిక మీదికి ఆహ్వానించారు. నైజాం ప్రభువు తన ఆస్తి గురించి ఆలోచించాడే గానీ ప్రజల గురించి ఆలోచించలేదని ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు.












Click it and Unblock the Notifications