• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

నీరు పల్లమెరుగు, తెలంగాణ ఎత్తులో ఉంది: ఉండవల్లి

By Pratap
|
Undavalli Arun Kumar
రాజమండ్రి: తెలంగాణ వాళ్లు గోదావరి నీటిని తోడేయడం వల్ల ఆంధ్ర ప్రాంతానికి నీరు అందడం లేదని రాజమండ్రి కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. పోలవరం ప్రాజెక్టును వ్యతిరేకించేవారిపై ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. గిరిజన ప్రాంతాలను మునిగిపోతాయని అంటారని, కానీ తప్పదని, గిరిజనులకు ఎంత కావాలో ఇస్తామని, మంచి ఇళ్లు కట్టిస్తామని ఆయన అన్నారు. జై ఆంధ్రప్రదేశ్ సభలో ఆయన శుక్రవారం సాయంత్రం మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ తెరాస అధ్యక్షుడు కెసిఆర కూతురు కల్వకుంట్ల కవిత కోర్టుకు వెళ్లారని ఆయన అన్నారు.

నీటిని దోచుకుంటున్నారని తెలంగాణ నాయకులు విమర్శలు చేస్తున్నారని, నీరు కిందికి ప్రవహిస్తుంటాయని ఆయన అన్నారు. నీరు పల్లమెరుగు నిజం దేవుడెరుగు ఆయన అన్నారు. తెలంగాణ జిల్లాల్లోని ప్రాంతాలు గోదావరి జలం చాలా కిందికి ఉంటుందని, పంపింగ్ సిస్టమ్ ద్వారా నీటిని ఎత్తిపోయాల్సి ఉంటుందని ఆయన అన్నారు. తెలంగాణలోని ఏయే జిల్లా గోదావరికి ఎంతెంత ఎక్కువ ఉన్నాయో ఆయన చెప్పారు. గోదావరి నీళ్లు కావాలంటే తోడుకోవాలని ఆయన అన్నారు. ఫస్టు ఫ్లోర్ వాడికి నీళ్లు వస్తుంటాయి, ఆరో అంతస్థువాడికి నీళ్లు రావని, గోదావరి జలాల విషయంలో కూడా అదే పరిస్థితి ఉంటుందని ఆయన అన్నారు.

తెలంగాణ రాళ్లూ రప్పలు ఉంటాయని, ఇక్కడ పచ్చగా ఉంటుందని, అందుకే నీళ్లు దోచుకుంటున్నారని అంటున్నారని ఆయన అన్నారు. గోదావరి నీటిని మొత్తం వాడుకోమని చెప్పండి అని ఆయన వ్యంగ్యంగా అన్నారు. గోదావరి నీరు దేవాదుల వద్ద 6 టిఎంసిలు మాత్రమే ఉంటే తమకు నీరు అందలేదని, దాంతో తమలో తామే కలహించుకోవాల్సి ఉందని ఆయన అన్నారు.

పోలవరం ప్రాజెక్టు కడితే నీటిని నిల్వ చేసుకోవచ్చునని, కృష్ణా నదికి జలాలను తరలించవచ్చునని ఆయన అన్నారు. తెలంగాణ నేతలకు సంస్కారం లేదని చెప్పడానికి కెసిఆర్ ప్రసంగాలను ఆయన సభలో వినిపించారు. రాష్ట్ర విభజనను 170 మందికి పైగా శాసనసభ్యులు వ్యతిరేకిస్తారని, ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్ర విభజనకు అంగీకరించబోమని ఆయన అన్నారు. తెరాస ఉద్యమ పార్టీ కాదని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ తాను తెలంగాణకు మద్దతిస్తే వెంటనే తిట్టాడని ఆయన అన్నారు.

2009లో కమ్యూనిస్టులతో, చంద్రబాబుతో కలిసి పోటీ చేశాడని, ఫలితాలు వచ్చేదాకా ఆగకుండా బిజెపి వద్దకు వెళ్లాడని ఆయన అన్నారు. ఎన్ని మాటలు తిట్టగలిగితే అంత తిట్టాలి, తానే వచ్చే ఎన్నికల్లో గెలవాలని కెసిఆర్ అనుకుంటున్నాడని ఆయన అన్నారు. కాంగ్రెసులో తెరాసను విలీనం చేస్తామని కెసిఆర్ చెప్తే నమ్మడానికి వీలు లేదని ఆయన అన్నారు. తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరామ్ తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబుపై చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పు పట్టారు.

భాష, యాసలపై రాష్ట్రం విడిపోవాలనడం సరి కాదని ఆయన అన్నారు. కలిసి స్నేహంగా ఉందామని ఆయన అన్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

lok-sabha-home

English summary
Congress Rajamundry MP Undavalli Arun Kumar said that Godavari river water will flow to the low level. that has lashed out at Telangana Rastra Samithi (TRS) president K Chandrasekhar Rao in his Jai Andhra Pradesh meeting.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more