నీ మాటల వల్లే...: కెసిఆర్‌పై దుమ్మెత్తిపోసిన ఉండవల్లి

Undavalli Arun Kumar
రాజమండ్రి: తెలంగాణ నాయకులు కట్టుకథలు చెబుతున్నారని, నెహ్రూ ప్రసంగాన్ని కూడా పార్లమెంటులో వక్రీకరించారని కాంగ్రెసు రాజమండ్రి పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. ఆరు సూత్రాల పథకం తెలంగాణ ప్రజలకు రక్షణ కల్పించడానికి కాదని, ముల్కీ నిబంధనలను రద్దు చేస్తూ హైదరాబాదులో మిగతా వారందరికీ అవకాశాలు కల్పించడానికి ఆరు సూత్రాల పథకం వచ్చిందని ఆయన అన్నారు. జై ఆంధ్రప్రదేశ్ సభలో ఆయన శుక్రవారం సాయంత్రం ప్రసంగించారు. జై ఆంధ్ర తీవ్రత కారణంగానే ఆరు సూత్రాల పథకం వచ్చిందని, రాష్ట్ర రాజధాని హైదరాబాదులో తమకు ఉద్యోగాలు లేనప్పుడు తమ రాష్ట్రం తమకు జై ఆంధ్ర ఉద్యమం వచ్చిందని ఆయన అన్నారు.

ఎవరూ మాయమాటలు చెప్పి ఆంధ్రలో తెలంగాణను కలుపుకోలేదని ఆయన అన్నారు. ముల్కీ నిబంధనలకు వ్యతిరేకంగానే జై ఆంధ్ర ఉద్యమం వచ్చిందని ఆయన అన్నారు. దొంగలమా, దోపిడీదారులమా అని ఆయన అడిగారు. ప్రత్యేక రాష్ట్రం కావాల్సిన వాళ్లు అడిగేవాళ్లు అనే మాటలా అని ఆయన అడిగారు. చర్చల ద్వారా సాధించుకోవాలని ఆయన అన్నారు. శాసనసభలో రాయలసీమ, ఆంధ్ర శాసనసభ్యులు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు తీర్మానం కానీయరని ఆయన అన్నారు. అసెంబ్లీలో తీర్మానం ద్వారానే రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమవుతుందని అప్పటి హోం మంత్రి చిదంబరం ప్రకటించారని ఆయన అన్నారు.

తెలంగాణను ఎవరూ అడ్డుకోవడం లేదని ఆయన అన్నారు. చరిత్రను తెలంగాణ నేతలు వక్రీకరిస్తున్నారని ఆయన విమర్శించారు. జై ఆంధ్ర తీవ్రతకు పివి నర్సింహారావు ముఖ్యమంత్రిగా దిగిపోవాల్సి వచ్చిందని, రాష్ట్రపతి పాలన విధించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. వెనకబాటుతనం కారణంగా రాష్ట్రాలను ఏర్పాటు చేయడం కూడదని బిజెపి అగ్రనేత ఎల్‌కె అద్వానీ అన్నారని ఆయన గుర్తు చేశారు. ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్నవాళ్లు తెరాస వ్యాఖ్యలను ఖండించాలని ఆయన అన్నారు.

భారత ప్రభుత్వం మాట నిలబడుతుందని ఆయన చెప్పారు. తెలంగాణ ప్రజా ప్రతినిధుల కోరిక మేరకే ఆంధ్రప్రదేశ్ అవతరణ ఏర్పడిందని ఆయన అన్నారు. తెలుగు మాట్లాడేవారు ఎక్కువగా ఉన్నందువల్లనే హైదరాబాదును రాష్ట్ర రాజధానిగా చేశారని ఆయన అన్నారు. జోనల్ విధానాన్ని, ఆరు సూత్రాల పథకం కూడడని తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మంత్రిగా ఉన్నప్పుడు కెసిఆర్ చేసిన ప్రసంగాన్ని వినిపించారు.

ఒక్క నాయకుడి పిల్లలైనా ఆత్మహత్య చేసుకున్నారా అని ఆయన అడిగారు. మీ మాటలు నమ్మి, నిరాశానిస్పృహకు గురై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆయన కెసిఆర్‌ను ఉద్దేశించి అన్నారు. నిజాం పాలనపై ఆయన దుమ్మెత్తిపోశారు. కెసిఆర్‌పై ఆయన తీవ్రమైన దాడికి దిగారు. వివిధ సందర్భాల్లో కెసిఆర్ చేసిన వ్యాఖ్యలను ఆయన వినిపిస్తూ దుయ్యబట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+