కెసిఆర్ ఏజెంట్.. ఖబర్దార్: జగ్గారెడ్డి, శాంతి ర్యాలీకి ఓకే

Jagga Reddy
హైదరాబాద్: కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ పైన సంగారెడ్డి శాసనసభ్యుడు, ప్రభుత్వ విప్ తూర్పు జయప్రకాశ్ రెడ్డి(జగ్గారెడ్డి) సోమవారం నిప్పులు చెరిగారు. పొన్నం మరోసారి తనపై నోరు జారితే ఖబర్దార్ అంటూ హెచ్చరించారు. రాజకీయాల్లో పొన్నం తన ముందు ఓ బచ్చా అని మండిపడ్డారు. ఆయన తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఏజెంట్ అని ధ్వజమెత్తారు.

తనపై మరోసారి నోరు జారితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. తనను టార్గెట్‌గా చేసుకుంటే తగిన రీతిలో గుణపాఠం చెబుతానన్నారు. మంత్రులను నియోజకవర్గంలో తిరగనివ్వకపోతే తెలంగాణ వస్తుందా అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ సెంటిమెంటు పేరుతో తెరాస 2014 సాధారణ ఎన్నికలలో రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నాలు చేస్తుందని జగ్గారెడ్డి నిప్పులు చెరిగారు.

ఓయు ర్యాలీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థుల పైన లాఠీఛార్జ్, బాష్పవాయువు ప్రయోగం పైన ఎపిసిఎల్పీ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. పోలీసుల తీరును తప్పుపడుతూ విద్యార్థులను సమర దీక్షకు అనుమతించాలని అందులో కోరారు.

స్పందించిన హైకోర్టు విద్యార్థుల ర్యాలీకి అనుమతి ఇచ్చింది. సమర దీక్షకు విద్యార్థులను పంపించాలని, అడ్డుకోవద్దని సూచించింది. ఒక్కరొక్కరుగా విశ్వవిద్యాలయ విద్యార్థుల గుర్తింపు కార్డులను చూసి ఇందిరాపార్కు వద్ద జరుగుతున్న సమర దీక్షకు వారిని పంపించాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది.

ఏఐఎస్ఎఫ్ విద్యార్థులు తెలంగాణ ప్రాంత మంత్రులు రాజీనామా చేయాలని పాత ఎమ్మెల్యే క్వార్టర్సును ముట్టడించారు. విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+