జానాకు బుద్దీజ్ఞానం ఉందా: కెసిఆర్, మళ్లీ ఫామ్‌హౌస్‌కి

తెలంగాణపై చర్చలు ఒక నాటకమని, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇస్తుందనడం బూటకమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆజాద్ ప్రకటనలో జానారెడ్డి ఏం నిజాయితీ కనిపించిందో చెప్పాలని డిమాండ్ చేశారు. చీము నెత్తురు ఉన్న, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, దిగువస్థాయి కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీని విడి ఉద్యమంలో కలవాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ వాదులు వేలాదిగా తరలివచ్చి సమరదీక్షను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సమర దీక్షలోనే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. కెసిఆర్ సోమవారంనాడు సమరదీక్షలో పాల్గొననున్నారు.
కాగా, అంతకు ముందు టీఆర్ఎస్ అధ్యక్షుడు కెసిఆర్ మళ్లీ తన వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్నారు. ఆదివారం ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరి మెదక్ జిల్లాలోని తన ఫామ్ హౌస్‌కు వెళ్లారు. ఈ నెల 16న మధ్యాహ్నం ఫామ్ హౌస్‌కి వెళ్లారు. 19న రాత్రి హైదరాబాద్‌లోని తన నివాసానికి వచ్చారు.
ఈ వారం రోజుల్లో ఆయనను పార్టీ శాసనసభ్యులు, నేతలతోపాటు, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉద్యోగ సంఘాల నేతలు, జేఏసీ చైర్మన్ కోదండరాం కలిశారు. పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యురాలు సునీతారెడ్డి అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఒక ప్రైవేట్ ఆస్పత్రికి కేసీఆర్ శనివారం సాయంత్రం వెళ్లి ఆమెను పరామర్శించారు. ఆదివారం ఆయన తిరిగి ఫామ్‌హౌస్‌కు వెళ్లిపోయారు.












Click it and Unblock the Notifications