కెసిఆర్‌అంటే తప్పులేదు, మేమంటే తప్పా?: జానా ప్రశ్న

ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆధ్వర్యంలో తెలంగాణ ఏర్పడుతుందనే ధీమా తమకు ఉందన్నారు. తెలంగాణ విషయంలో జరుగుతున్న పరిణామంలో కొంత ఆలస్యం జరిగితే తెలంగాణవాదులు తమను లక్ష్యంగా చేసుకున్నారని అయితే, అవమానాలు భరించి అయినా తెలంగాణ సాధించి ప్రజల ముందు పెడతామన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడటం సరికాదన్నారు.
తెలంగాణ సాధనకు సంయమనం అవసరమన్నారు. తెలంగాణ కోసం అన్ని స్థాయిల్లో ప్రజాప్రతినిధులు కృషి చేస్తున్నారన్నారు. తెలంగాణ విషయంలో తాను మాట తప్పే పరిస్థితి, మడమ తిప్పే పరిస్థితి లేదన్నారు. తెలంగాణ కోసం రాజీనామాలకు సైతం తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ఎలాంటి త్యాగాలకు వెనుకకు పోయేది లేదన్నారు. కొందరు నేతలు తమపై ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని అది సరికాదని కోమటిరెడ్డి సోదరులను ఉద్దేశించి అన్నారు.
తెలంగాణపై కాంగ్రెసు పార్టీ అధిష్టానం తీవ్రంగా ఆలోచిస్తోందన్నారు. త్వరలో సమస్యకు పరిష్కారం చూపిస్తుందన్నారు. ప్రజల ఆకాంక్ష అయిన తెలంగాణ రాష్ట్రాన్ని తాము ఎట్టి పరిస్థితుల్లోనూ సాధిస్తామని అన్నారు. తాము 1999 నుండి తెలంగాణ కోసం ఏమి చేస్తున్నామో పూర్తి వివరాలు మీడియాకు అందిస్తున్నామని చెప్పారు. అవసరమైన సమయంలో పదవులను తృణపాయంగా వదులుతామన్నారు.
తెరాస అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు నెలలో తెలంగాణ వస్తుందంటే తప్పు లేదు. కానీ తాము చెబితే తప్పా అని ప్రశ్నించారు. తెలంగాణ కోసం ఆలోచిస్తున్నామని తమ పార్టీ చెప్పడంలో తప్పేముందన్నారు. కెసిఆర్ మాటలు పనికిమాలినవి అన్నారు. నా జీవితంలో నేనెప్పుడు మాట తప్పలేదన్నారు. తెలంగాణ తుదిదశకు వచ్చిందనే సంయమనం పాటిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణపై అనుకూల ప్రకటన రాకుంటే అందరం కలిసి కార్యాచరణ ఏర్పాటు చేసుకుంటామన్నారు. త్యాగం అంటే తెలంగాణ ప్రజలు కోరుతున్నట్లుగా కేవలం పదవులకే కాదని అన్ని రకాలుగా త్యాగాలు చేసి ప్రజల ముందు నిలబడతామన్నారు. తమ పార్టీ నాయకత్వంపై తమకు పూర్తి నమ్మకం ఉందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.












Click it and Unblock the Notifications