ఎంపి పొన్నం ఇంటి ముట్టడి, కెసిఆర్ తప్పు: నారాయణ

Ponnam Prabhakar
హైదరాబాద్/విజయవాడ/కరీంనగర్: ఐటి మంత్రి పొన్నాల లక్ష్మయ్యను సికింద్రాబాదులోని తిరుమలగిరిలో తెలంగాణవాదులు అడ్డుకున్నారు. రాష్ట్రం కోసం మంత్రి పదవికి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. దీంతో పొన్నాల గన్‌మెన్ తెలంగాణవాదులను తరిమేసే ప్రయత్నాలు చేశారు. పోలీసులు జోక్యం చేసుకొని తెలంగాణవాదులను అదుపులోకి తీసుకున్నారు. నిరసనకారులు మంత్రి కాన్వాయ్‌ని వెంబడిస్తూ నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా పొన్నాల మాట్లాడారు. కేంద్రం, తమ పార్టీ అధిష్టానం తెలంగాణ సమస్యను పరిష్కరించేందుకు ఆలోచిస్తోందన్నారు. త్వరలో తెలంగాణకు అనుకూలంగా ప్రకటన వెలువడుతుందన్నారు. చివరి దశలో ఉన్న తెలంగాణ.. తమ ప్రభావం వల్లనే వచ్చిందని చెప్పుకునేందుకే రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

తేల్చాల్సింది కాంగ్రెస్సే

తెలంగాణ అంశాన్ని తేల్చవలసింది అధికార కాంగ్రెసు పార్టీయే అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ విజయవాడలో అన్నారు. ఆయన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును కలిశారు. పాదయాత్ర ఆపేసి విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ విశ్రాంతి తీసుకుంటున్న బాబును నారాయణ పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు భాషతో తాను ఏకీభవించనని చెప్పారు. తెలంగాణపై రాజమండ్రి పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పినట్లుగా చర్చల ప్రతిపాదనకు కాంగ్రెసు పార్టీ ముందుకు రావాలని ఆయన సూచించారు.

పొన్నం ఇంటి ముట్టడి

భారతీయ జనతా యువజన మోర్చా(బిజెవైఎం) కార్యకర్తలు తెలంగాణ కోసం రాజీనామా చేయాలంటూ పొన్నం ప్రభాకర్ ఇంటిని కరీంనగర్‌లో ముట్టడించారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. షిండే, ఆజాద్‌ల పైన చర్యలు తీసుకోవాలని సిరిసిల్ల డిఎస్పీకి తెరాస ఫిర్యాదు చేసింది.

ముఖ్యమంత్రి, జగ్గారెడ్డిలపై తెలంగాణ న్యాయవాదుల ఫిర్యాదు

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్ తూర్పు జయప్రకాశ్ రెడ్డి(జగ్గారెడ్డి)లపై తెలంగాణ న్యాయవాదులు సైఫాబాద్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కెసిఆర్ పైన బాధ్యాతారహిత వ్యాఖ్యలు చేసినందుకు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+