తెలంగాణపై నీళ్లు: షిండే కూడా ఆజాదూయే, నో డెడ్‌లైన్

రాజీనామాలు ఇచ్చేందుకే వచ్చాం
తెలంగాణ విషయంలో తాము ఎట్టి పరిస్థితుల్లో వెనుకడుగు వేసేది లేదని తెలంగాణ ప్రాంత కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యులు న్యూఢిల్లీలో స్పష్టం చేశారు. అధిష్టానం నుండి పిలుపు రావడంతో వారు ఈ రోజు ఢిల్లీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. తెలంగాణకు అనుకూలంగా లేనిపక్షంలో తమ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి రాజీనామాలు సమర్పించేందుకే వచ్చామన్నారు.
కేంద్రమంత్రి వాయలార్ రవి పిలిస్తే వచ్చామని.. ఆయన చెప్పేది వినడమే తప్పా తాము చెప్పేదేమీ లేదన్నారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగానే రాజీనామా నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇప్పటికే తాము చెప్పాల్సిందంతా వారికి చెప్పామన్నారు. విసిగి విసిగి వేసారిపోయామన్నారు. తమ మనసులు కాలిపోయాయని చెప్పారు.
ప్రజలకు చూపించే స్థితిలో తాము లేమని చెప్పారు. చర్చలతోనే సమస్య పరిష్కారం అవుతుందన్న భావనతో తాము ఇప్పుడు ఢిల్లీకి వచ్చినట్లు చెప్పారు. తాము ఒక్క మాట కూడా మాట్లాడమని, వారు చెప్పిందే వింటామన్నారు. అనుకూలంగా లేకుంటే రాజీనామాలే మా పరిష్కారం అన్నారు.












Click it and Unblock the Notifications