పచ్చిబూతులు, అలా రాష్ట్రమిస్తారా?: కెసిఆర్‌పై జగ్గారెడ్డి

అధికారంలో ఉన్న కాంగ్రెసు పార్టీతో మంచిగా నడుచుకొని రాష్ట్రం ఎలా సాధించుకోవాలో ఆలోచించడం మానేసి.. ఇష్టం వచ్చినట్లుగా తిడితే రాష్ట్రం వస్తుందా అన్నారు. వరాలు ఇచ్చే దేవుడిని తూలనాడితే వరం ఇస్తారా? అని ప్రశ్నించారు. తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వాలనుకుంటున్నారని ఇలాంటి సమయంలో కెసిఆర్ ఘాటు వ్యాఖ్యలు తెలంగాణకు అడ్డుపడేలా ఉన్నాయని ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు.
ఓ రాజకీయ నాయకుడిగా మాట్లాడాల్సిన మాటలు కాదన్నారు. కాంగ్రసును విమర్శిస్తే తెలంగాణ ఎలా వస్తుందన్నారు. నాయకులను చూసి ప్రజలు మంచి నేర్చుకోవాలే తప్ప చీదరించుకోవద్దన్నారు. సోనియాను మెప్పించే ప్రయత్నాలు చేయాలన్నారు. కెసిఆర్‌లా బూతులు మాట్లాడిన రాజకీయ నేతలు రాష్ట్ర రాజకీయ చరిత్రలోనే లేరన్నారు. కెసిఆర్ మాటల వల్ల వచ్చే తెలంగాణ ఆగిపోతుందేమనని ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు.
కెసిఆర్ మాటలను జెఏసి సమర్థిస్తే దానికి కూడా తెలంగాణపై చిత్తశుద్ది లేనట్లే అన్నారు. 2014 ఎన్నికలే టార్గెట్‌గా కెసిఆర్ రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారన్నారు. కెసిఆర్ పచ్చిబూతులు మాట్లాడారన్నారు. తిట్లపురాణం ఆపకుంటే బాగుండదని అన్నారు. కెసిఆర్‌ను అరెస్టు చేస్తే ప్రజల్ని రెచ్చగొట్టి రాజకీయ లబ్ధిపొందాలనేది తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి చైర్మన్ కోదండరామ్ ప్రణాళిక అన్నారు.












Click it and Unblock the Notifications