నీ ఇంటికొస్తా, దమ్ముంటే అరెస్ట్ చెయ్: సిఎంకు కోదండ

ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేసే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ కోసం చనిపోయిన వారు తమ బిడ్డలే అన్న రాజమండ్రి పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ ఆ కుటుంబాలకు ఏం సమాధానం చెబుతారన్నారు. అందరూ సమానమే అయినప్పుడు ప్రధానిని తిట్టేందుకు హోదా అవసరం లేదన్నారు.
పౌరులుగా తమ అధికారాన్ని తాము ఉపయోగించుకున్నామని చెప్పారు. కేసులు పెట్టి తమను జైలుకు పంపిస్తే ఉద్యమం ఆగుతుందనుకుంటే పొరపాటు అన్నారు. అది మూర్ఖత్వమే అవుతుందన్నారు. ప్రజా జీవితంలో ఉండే నేతల పైన విమర్శలు సహజమేనని కోదండరామ్ అన్నారు.
తెలంగాణ వారిని ఖాసీం రజ్వీతో పోల్చిన రాజమండ్రి పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ పైన కేసులేవని తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలు ప్రశ్నించారు. తెలంగాణ వారిని అవమానించిన మంత్రి టిజి వెంకటేష్, తెలుగుదేశం పార్టీ నేత పయ్యావుల కేశవ్‌ల పైన కూడా చర్యలు తీసుకోలేదన్నారు. ఉద్యోగులను ప్రభుత్వం వేధిస్తోందన్నారు. ఉద్యోగులను వేధించిన ఏ సర్కారు ఇప్పటి వరకు బతికి బట్టకట్టలేదన్నారు.












Click it and Unblock the Notifications