కెసిఆర్‌కు సీట్ల పైనే దృష్టి: జగన్, కాంగ్రెస్‌పై నిప్పులు

డిసెంబర్ 31 తర్వాత జనవరి 1 వస్తుందంటూ గవర్నర్ నరసింహన్ అతి తెలివితేటలు ప్రదర్శించినట్లే నెల అంటే 30 రోజులే కాదని చెబుతూ గులాం నబీ ఆజాద్ అధికార పార్టీ మోసకారితనాన్ని బయటపెట్టారన్నారు. కాంగ్రెస్ ఎత్తుగడలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. తెలంగాణ సాధన కోసం విద్యార్థులు, యువకులు, కార్మికులు, రైతులు, మహిళలు మిలిటెంట్ పోరాటాలు చేయాలన్నారు. ఆజాద్ ప్రకటనతో తెలంగాణ అంశాన్ని కోల్డ్ స్టోరేజ్‌లో పెట్టినట్లుగా కనిపిస్తోందన్నారు.
తెరాసను తన గూటికి చేర్చుకునేందుకు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిన తన దారికి తెచ్చుకునేందుకు, పాదయాత్ర చేస్తున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును ఇరుకున పెట్టేందుకు ఎంపీలు లగడపాటి రాజగోపాల్, ఉండవల్లి అరుణ్ కుమార్‌లతో అధిష్టానం నాటకాలు ఆడిస్తోందన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే రాజీనామాలను స్పీకర్‌కు పంపాలన్నారు.
ప్రజలను గందరగోళపర్చి విశ్వసనీయతను పెంచుకునేందుకు నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు మధు యాష్కీ ప్రయత్నిస్తున్నారన్నారు. లాబీయింగ్ అంటూ కెసిఆర్ తన ఫామ్‌హౌస్‌కు పరిమితం కావడమో, ఢిల్లీలో పడిగాపులు కాయడమో చేశాడని విమర్శించారు.
కెటిఆర్ నుంచి మధుయాష్కీ వరకూ రాహుల్ నాయకత్వంపై విశ్వసనీయత పెంచే ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లాబీయింగ్‌లో ఒంటరైన కెసిఆర్ ఇప్పుడు ఉద్యమం ఉంటున్నాడని మండిపడ్డారు. 2014 ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు గెలుచుకోవడంపైనే తప్ప తెలంగాణ సాధనపై కెసిఆర్‌కు చిత్తశుద్ధి లేదన్నారు.












Click it and Unblock the Notifications