పోలీసు కస్టడీకి అక్బర్: సంగారెడ్డి కోర్టులో చుక్కెదురు

ద్వేషపూరిత వ్యాఖ్యల కేసులో అక్బరుద్దీన్ ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లా కోర్టులో ఉన్న విషయం తెలిసిందే. నిరుడు డిసెంబర్ 8వ తేదీన ద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిన కేసులో నిజామాబాద్ కోర్టు ఆయనకు ఫిబ్రవరి 7వ తేదీ వరకు జ్యుడిషియల్ రిమాండ్‌కు పంపుతూ నిజామాబాద్ కోర్టు జనవరి 24వ తేదీన ఆదేశాలు జారీ చేసింది.
ఇదిలావుంటే, మెదక్ జిల్లా సంగారెడ్డి కోర్టులో అక్బరుద్దీన్‌కు బుధవారం చుక్కెదురైంది. ఓ కేసులో సంగారెడ్డి కోర్టు బుధవారం అక్బరుద్దీన్ బెయిల్ పిటిషన్‌ను తోసిపుచ్చింది. ఆయన బెయిల్ పిటిషన్‌పై మంగళ, బుధవారాల్లో కోర్టులో వాదనలు జరిగాయి. ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత కోర్టు బుధవారం మధ్యాహ్నం తన నిర్ణయాన్ని ప్రకటించింది. కలెక్టర్‌ను దూషించిన కేసులో మెదక్ జిల్లాలో కేసు నమోదైన విషయం తెలిసిందే.
డిసింబర్ 22వ తేదీన ఆదిలాబాద్ జిల్లా నిర్మల్‌లో చేసిన ద్వేషపూరిత వ్యాఖ్యల కేసులో పోలీసులు ఆయనను జనవరి 8వ తేదీన అరెస్టు చేశారు. హైదరాబాదులోని చాంద్రాయణగుట్ట శానససభ్యుడైన అక్బరుద్దీన్ ఓవైసీపై ద్వేషపూరిత వ్యాఖ్యలకు గాను హైరాబాద్, రంగారెడ్డి తదితర జిల్లాల్లో కేసులు నమోదయ్యాయి.












Click it and Unblock the Notifications