మహిళలపై ఫేస్‌బుక్ వ్యాఖ్యలు: ఇద్దరు టెక్కీల అరెస్టు

ఫిర్యాదుపై అనురాగ్ శర్మ మహిళా కార్యకర్తలను సైబర్ క్రైమ్ పోలీసులకు తెలియజేయాలని చెప్పారు. ఇద్దరు ఐటి ఉద్యోగులను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ప్రాథమిక విచారణ తర్వాత సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. టెక్కీల ఇళ్లకు వెళ్లి పోలీసులు వారిద్దరని మంగళవారం అరెస్టు చేశారు.
వారిని జ్యుడిషియల్ కస్టడీకి పంపించారు. తమకు కష్టాలు వస్తాయని పసిగట్టిన టెక్కీలు ఇద్దరు తమ ఫేస్‌బుక్ ఖాతాలను డీయాక్టివేట్ చేశారు.
కొద్దికాలంగా వారిద్దరు ఫేస్‌బుక్‌లో యువతులను, మహిళలను అసభ్యంగా వర్ణిస్తూ వ్యాఖ్యలు రాస్తున్నట్లు మహిళా సంఘాల దృష్టికి వచ్చింది. దీంతో మహిళా సంఘాల కార్యకర్తలు పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మను కలిశారు.












Click it and Unblock the Notifications