హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బొత్స కలకలం: కిరణ్‌ కుమార్ రెడ్డికి మంత్రుల బాసట

By Pratap
|
Google Oneindia TeluguNews

Sunitha Laxma Reddy-Raghuveera Reddy
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌కు మద్దతు ఇస్తున్న తమ పార్టీకి చెందిన 9 మంది శానససభ్యులను బహిష్కరించినట్లు తెలిపిన నేపథ్యంలో తలెత్తిన సంక్షోభం నేపథ్యంలో మంత్రులు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి బాసటగా నిలిచారు. కాంగ్రెసు నుంచి 9 మంది శాసనసభ్యులను బహిష్కరించినప్పటికీ కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి ఢోకా లేదని మంత్రి రఘువీరా రెడ్డి అన్నారు. 2014 వరకు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగుతారని ఆయన శనివారం విశ్వాసం వ్యక్తం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీలో పడిందనే వ్యాఖ్యల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు. పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ వ్యాఖ్యల్లో తప్పేమీ లేదని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సుస్థిరంగా ఉందని మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, కాసు వెంకటకృష్ణా రెడ్డి అన్నారు. 2014వరకు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటారని వారు విశ్వాసం వ్యక్తం చేశారు. బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలను తాము విశ్లేషించబోమని అన్నారు.

తమ ప్రభుత్వంపై గతంలో అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించి ప్రతిపక్షాలు భంగపడ్డాయని తెలంగాణకు చెందిన మంత్రి సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. ప్రభుత్వానికి ఏ విధమైన ఢోకా లేదని ఆమె శనివారంనాడు అన్నారు. క్రమశిక్షణను ఉల్లంఘిస్తే చర్యలు ఉంటాయనే సంకేతాలను మాత్రమే పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఇచ్చారని ఆమె అన్నారు. పార్టీ నిబంధనలను ఉల్లంఘించినవారిపై వేటు వేయడంలో తప్పేమిటని ఆమె అడిగారు.

ప్రభుత్వం సుస్థిరంగా ఉందని తెలంగాణకు చెందిన మరో మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. తమ ప్రభుత్వానికి ఏ విధమైన ఢోకా లేదని, తమది స్థిరమైన ప్రభుత్వమని ఆయన అన్నారు. ప్రభుత్వం మెజారిటీలోనే ఉందని, మైనారిటీలో లేదని కాసు వెంకటకృష్ణా రెడ్డి అన్నారు. గత అసెంబ్లీలోనే తాము మెజారిటీనీ నిరూపించుకున్నామని ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు.

English summary
The Ministers like anam Ramanarayana Reddy, Raghuveera Reddy and Sunitha Lakshma reddy have supported CM Kiran Kumar Reddy in the context of PCC president Botsa Satyanarayana comments.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X