జగన్, కెవిపి ఇప్పట్లో కలవరు, ప్రధానిని ఎన్నిక.: సబ్బం

వచ్చే ఎన్నికల్లో జగన్ పార్టీ ఎవరితో పొత్తులు పెట్టుకోదని చెప్పారు. నిత్యం తన కుటుంబాన్ని వేధిస్తున్న కాంగ్రెసుతో జగన్‌కు కలవాల్సిన అవసరమేముందన్నారు. రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్రరావుకు, జగన్‌కు మధ్య అఘాతం ఉందని, ఇప్పట్లో ఇద్దరూ కలిసే అవకాశం లేదన్నారు. తొమ్మిది మంది ఎమ్మెల్యేలను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని చెబుతున్న ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ వారి పేర్లు మాత్రం తర్వాత ప్రకటిస్తానని చెప్పడం విడ్డూరమన్నారు.
కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన ఎమ్మెల్యేలే స్పీకర్‌కు రాజీనామాలు సమర్పిస్తే మూడునెలలు గడిచినా దానిపై నిర్ణయం తీసుకోలేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు మైనార్టీలో పడిందని, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కోరుకుంటేనే ఎన్నికలు జరుగుతాయని అన్నారు. తనకు తెలిసి కాంగ్రెస్ అధికారంలో ఉండగా మధ్యంతర ఎన్నికలు వచ్చిన దాఖలాలు ఎక్కడా లేవన్నారు.
ఒకే భాష మాట్లాడేవారికి రెండు రాష్ట్రాలుంటే తప్పేంటని బొత్స అనడం తప్పని సబ్బం హరి విమర్శించారు. ప్రాంతీయ భాష మాట్లాడేవారికి దేశంలో ఎక్కడా రెండు రాష్ట్రాలు లేవన్నారు. బెంగాలీ, భోజ్‌పురి, మరాఠీ, ఒరియా, తమిళ్ ఇలా ఏ ప్రాంతీయ భాష తీసుకున్నా వారికి ఒకటే రాష్ట్రం ఉందన్నారు. సహకార సంఘాల ఎన్నికల్లో గెలిచామని కాంగ్రెస్ పార్టీ జబ్బలు చరుచుకుని అదే బలమని భావిస్తే.. ఆ భ్రమలో ఇంకో 8 నెలలు కొనసాగాలని తాను సూచిస్తున్నానన్నారు.












Click it and Unblock the Notifications