జగన్‌తో వెళ్తే డోంట్ కేర్: హర్ష, సబ్బం మాటేంటి?: టిడిపి

కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదన్నారు. 2014 వరకు కిరణే ముఖ్యమంత్రిగా కొనసాగుతారని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెసు పార్టీని వీడే వారిని గురించి అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. మాజీ మంత్రి, కంటోన్మెంటు శాసనసభ్యుడు శంకర రావు అరెస్టును తాను తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు.
సబ్బంతో జగన్ వీడియోలు విడుదల చేయాలి
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వైపు వెళ్తున్నారని తొమ్మిది మంది ఎమ్మెల్యేల పైన వేటు వేసిన ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అనకాపల్లి పార్లమెంటు సభ్యుడు సబ్బం హరిని ఎందుకు విస్మరిస్తున్నారో చెప్పాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఆదివారం ప్రశ్నించారు.
కాంగ్రెసులో పార్టీలో ఉన్న సబ్బం జగన్ తరఫున మాట్లాడటం శోచనీయం అన్నారు. సబ్బంను ఎందుకు పార్టీ నుండి సస్పెండ్ చేయడం లేదో చెప్పాలన్నారు. సబ్బం హరి అధిష్టానానికి, జగన్‌కు వారధిగా మారారని విమర్సించారు. జగన్‌తో సబ్బం హరి ములాకత్ వీడియోలు బయట పెట్టాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications