వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్చ్.. బాగాలేదు!: ఆజాద్ అసంతృప్తి, ఇదీ సంగతి: కిరణ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy-Ghulam Nabi Azad
న్యూఢిల్లీ: కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం తీరు పైన కేంద్రమంత్రి, రాష్ట్ర కాంగ్రెసు పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ ఆజాద్ సోమవారం తన అసంతృప్తిని వ్యక్తం చేశారట. ఢిల్లీ నుండి పిలుపు రావడంతో ముఖ్యమంత్రి కిరణ్ వచ్చారు. ఆయన ఉదయం ఆజాద్‌తో సమావేశమయ్యారు. తెలంగాణ పైన, రాష్ట్ర రాజకీయ పరిస్థితుల పైన వారి మధ్య చర్చ సాగింది. గంటకు పైగా కిరణ్, ఆజాద్‌లు భేటీ అయ్యారు.

తనను కలిసిన కిరణ్‌పై ఆజాద్ తన అసంతృప్తిని వ్యక్తం చేశారట. మాజీ మంత్రి, కంటోన్మెంటు శాసనసభ్యుడు శంకర రావు, మజ్లిస్ పార్టీ శాసనసభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసీలపై ప్రభుత్వం వ్యవహించిన తీరు సరిగాలేదని మందలించినట్లుగా తెలుస్తోంది. అయితే, శంకరరావు, ఓవైసీల అరెస్టు విషయంపై కిరణ్ ఆజాద్‌కు వివరణ ఇచ్చినట్లుగా సమాచారం. ఆజాద్‌ను కలిసిన కిరణ్ సహకార సంఘ ఎన్నికలపై నివేదిక కూడా ఇచ్చారు. ఇటీవల మొదటి విడత సహకార సంఘ ఎన్నికలు పూర్తయ్యాయి.

ఈ రోజు రెండో విడత జరుగుతున్నాయి. మొదటి విడత కాంగ్రెసు పార్టీ అధిక స్థానాలను కైవసం చేసుకుంది. ఈ నివేదికను కిరణ్ ఆజాద్‌కు ఇచ్చారు. రెండో విడతలోనూ కాంగ్రెసు పార్టీయే అధిక స్థానాలు గెలుచుకుంటుందని కిరణ్ ఆజాద్‌తో ధీమా వ్యక్తం చేశారని తెలుస్తోంది. తెలంగాణలో ప్రస్తుత పరిస్థితులు, రాజకీయ వ్యవహారాలు, రాష్ట్రంలో కాంగ్రెసు పార్టీ బలం తదితర అంశాలపై వారు మాట్లాడినట్లుగా సమాచారం.

గులాం నబీ ఆజాద్‌తో భేటీ అనంతరం కిరణ్ కుమార్ రెడ్డి ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీతో భేటీ అయ్యారు. తెలంగాణ, రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితిపై వారు చర్చిస్తున్నారు. సోనియాకు కూడా కిరణ్ సహకార ఎన్నికల రిపోర్టు ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

English summary
It is said that Central Minister and state Congress party incharge Ghulam Nabi Azad unhappy with Kiran Kumar Reddy's government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X