మంగళసూత్రంతో కనిపించిన త్రిష.!! సోషల్ మీడియాలో వీడియో వైరల్..!

స్టార్ హీరోయిన్ త్రిష మరోసారి వార్తల్లో నిలిచారు. తమిళనాడు సీఎం, దళపతి విజయ్ నుంచి అతని భార్య సంగీత సోర్నలింగం విడాకులు తీసుకోబోతుందంటూ ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో భారీగా ప్రచారం జరిగింది. ఇటీవల తమిళనాడు ఎన్నికల సమయంలో విజయ్ ఎన్నికల ప్రచారంలో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. అయితే సోషల్ మీడియాలో వచ్చిన కథనాలను నిజం చేస్తూ విజయ్ సతీమణి సంగీత.. తమిళనాడులోని చెంగల్ పట్టు జిల్లాలోని ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేశారు. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద తమ వివాహాన్ని రద్దు చేయాలని ఆమె కోరారు. అలాగే ఇటీవల సంగీత కీలక ఆరోపణలు చేశారు.

Trisha Secret Engagement Rumours Explode After Viral Video Surfaces Social Media Trisha Engagement

తన భర్త విజయ్.. ఓ హీరోయిన్ తో అఫైర్ పెట్టుకున్నారని.. తనకు న్యాయం జరగకపోతే ఆమె ఎవరో బయటపెడతానని సంచలన ఆరోపణలు చేశారు. ఆమె ఆరోపణలు తమిళనాట హాట్ టాపిక్ గా మారాయి. అయితే ఈ వివాదం కొనసాగుతున్న వేళ విజయ్, నటి త్రిష ఒకే కారులో ప్రత్యక్షం కావడం సంచలనం రేపింది. చెన్నైలోని ఓ వివాహ కార్యక్రమానికి వీళ్లిద్దరూ జంటగా ఒకే కారులో రావడం.. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. దాంతో విజయ్- త్రిషల ప్రేమ వ్యవహారం మరోసారి హాట్ టాపిక్ గా మారింది.

ఆ తర్వాత తమిళనాడులో విజయ్ టీవీకే పార్టీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణస్వీకార కార్యక్రమంలో త్రిష ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. విజయ్ భార్య, పిల్లలు ఎవరూ ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. కానీ త్రిష మాత్రం తమిళ సంప్రదాయ పద్దతిలో వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. అంతేకాక తమిళనాడులో ఎన్నికల కౌంటింగ్ రోజు విజయ్ టీవీకే పార్టీ ముందంజలోకి రాగానే త్రిష.. స్వయంగా విజయ్ ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో విజయ్- త్రిష వివాహం చేసుకుంటారనే వాదనలు బలపడ్డాయి.

అయితే తాజాగా త్రిషకు సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇటీవల త్రిష ఓ కార్యక్రమంలో పాల్గొనగా ఆమె మెడలో ఓ లాకెట్ కనిపించింది. రావి ఆకు మోడల్ లో మంగళసూత్రం మాదిరి ఆ లాకెట్ ఉంది. దాంతో అది ఖచ్చితంగా కేరళ క్రిస్టియన్ స్టైల్ మంగళసూత్రం అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. త్రిష సీక్రెట్ గా పెళ్లి లేదా ఎంగేజ్ మెంట్ చేసుకున్నారా..? అని రకరకాలుగా సోషల్ మీడియాలో ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఈ వీడియో ఓ పాత వీడియో అని తెలుస్తోంది. త్రిష థగ్ లైఫ్ మూవీ ప్రొమోషన్స్ లో భాగంగా తీసిన వీడియో అని సమాచారం. అయితే కొందరు మాత్రం ఇది ఏఐ వీడియో అని కామెంట్స్ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+