టీఎంసీ విలీనంపై తేల్చేసిన కాంగ్రెస్..! కేసీ వేణుగోపాల్ క్లారిటీ..!

బెంగాల్ ఎన్నికల ఫలితాల తర్వాత తృణమూల్ కాంగ్రెస్ నేతలు వరుసగా బీజేపీకి క్యూ కడుతున్న నేపథ్యంలో తన పార్టీని కాంగ్రెస్ (Congress) లో విలీనం చేసేందుకు మమతా బెనర్జీ ప్రయత్నిస్తున్నారనే చర్చ మొదలైంది. ఈ మేరకు ఇండియా కూటమి భేటీలో కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో మమతా బెనర్జీ సన్నిహితంగా మెలగడం, ఆ తర్వాత కూడా వీరిద్దరూ భేటీ కావడం, అనంతరం రాహుల్ గాంధీని మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీ కలవడంతో విలీనం చర్చ ముదిరింది.

అల్లుడు కావాలా ? మేం కావాలా ? మమతకు వీర విధేయుడి అల్టిమేటం..!
అల్లుడు కావాలా ? మేం కావాలా ? మమతకు వీర విధేయుడి అల్టిమేటం..!

అయితే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో నిర్వహించిన అత్యవసర భేటీ తర్వాత మీడియా అడిగిన ప్రశ్నలకు స్పందిస్తూ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ టీఎంసీ విలీనం ప్రచారంపై సమాధానం ఇచ్చారు. కాంగ్రెస్ లో టీఎంసీ విలీనం వార్తల్ని కేసీ వేణుగోపాల్ ఖండించారు. అవన్నీ నిరాధార వార్తలే అని కొట్టిపారేశారు. ఇండియా కూటమి బలోపేతంపైనే తాము చర్చలు జరిపినట్లు క్లారిటీ ఇచ్చారు.

Congress Clarifies on TMC Merger Buzz KC Venugopal Calls Reports Baseless
తృణమూల్ విలీనంపై తేల్చేసిన కాంగ్రెస్..! కీలక షరతు..!
తృణమూల్ విలీనంపై తేల్చేసిన కాంగ్రెస్..! కీలక షరతు..!

దీంతో కాంగ్రెస్ లో టీఎంసీ విలీనంపై మూడు రోజులుగా జరుగుతున్న ప్రచారానికి ఫుల్ స్టాప్ పడినట్లయింది. అటు టీఎంసీ వర్గాలు సైతం ఈ ప్రచారాన్ని ఖండించాయి. బీజేపీ అనుకూల మీడియా వ్యాప్తి చేస్తున్న ప్రచారంగా దీన్ని కొట్టిపారేశాయి. బెంగాల్లో బలహీనపడిన నేపథ్యంలో ఇండియా కూటమి ద్వారా తిరిగి బలపడాలని టీఎంసీ కోరుకుంటున్నట్లు దీన్ని బట్టి అర్థమవుతోంది. గతంలో బెంగాల్లో అధికారం చెలాయిస్తున్నప్పుడు రాహుల్ ను ప్రధాని చేద్దామని ప్రతిపాదిస్తే పట్టించుకోని మమతా బెనర్జీ ఇప్పుడు అదే రాహుల్, సోనియా చుట్టూ తిరగడం మారిన పరిస్ధితులకు అద్దం పట్టేలా ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+