తృణమూల్ విలీనంపై తేల్చేసిన కాంగ్రెస్..! కీలక షరతు..!
పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల తర్వాత చోటు చేసుకుంటున్న పరిణామాలు నిన్న మొన్నటి వరకూ అక్కడ అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ముందు ఎమ్మెల్యేలు చీలిపోయి బీజేపీకి మద్దతుగా నిలవగా.. ఇప్పుడు ఎంపీలు సైతం అదే బాట పట్టారు. దీంతో రోజురోజుకూ బలహీన పడుతున్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (TMC).. ఇప్పుడు తన మాతృపార్టీ కాంగ్రెస్ (congress) వైపు చూస్తోంది. నిన్న సోనియా-మమత, ఇవాళ రాహుల్-అభిషేక్ బెనర్జీ వరుసగా దీనిపై చర్చలు జరుపుతున్నారు.
అయితే తృణమూల్ కాంగ్రెస్ ను కాంగ్రెస్ లో విలీనం చేయబోతున్న అంశంపై మాత్రం నేతలు నోరు మెదపట్లేదు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ముందుగా తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీని తమ పార్టీని విలీనం చేయాలని ప్రతిపాదించారని, దీనిపై స్పందించేందుకు మమత సమయం కోరినట్లు వార్తలు వచ్చాయి. వీటిపై కాంగ్రెస్ పార్టీ వర్గాలు స్పందించాయి. తృణమూల్ నుంచి విలీన ప్రతిపాదన వస్తే పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని తెలిపాయి.

తాజాగా ఇండియా కూటమి భేటీలో.. తాము బలమైన కూటమిని కోరుకుంటున్నామని, ప్రతిపక్ష కూటమిలో రాహుల్ గాంధీ నాయకత్వాన్ని అంగీకరిస్తున్నామని తృణమూల్ వెల్లడించింది. ఈ నేపథ్యంలో విలీనానికి సంబంధించిన ఏ ప్రతిపాదన అయినా తృణమూల్ నుంచే రావాలని, తాము అలాంటి చర్య కోసం ఒత్తిడి చేయడం లేదని కాంగ్రెస్ స్పష్టం చేసింది. కూటమి సమావేశం అనంతరం ఇరు పార్టీల మధ్య కొనసాగుతున్న సంప్రదింపులలో భాగంగానే ఇవాళ రాహుల్ గాంధీ, అభిషేక్ బెనర్జీల మధ్య సమావేశం జరిగింది. ఇందులో బీజేపీని ఎదుర్కోవడానికి మరింత సమన్వయం, ఐక్యత అవసరమని వీరు నిర్ణయించారు.














Click it and Unblock the Notifications