కాంగ్రెస్ అత్యవసర భేటీ: అన్ని రాష్ట్రాల పీసీసీ ప్రెసిడెంట్లకు ఢిల్లీకి పిలుపు

దేశంలో రాజ్యసభ ఎన్నికల కోలాహలం కొనసాగుతోంది. జూన్ 18న జరగనున్న ఈ ఎన్నికల్లో 10 రాష్ట్రాలకు చెందిన 24 స్థానాలకు పోటీ నెలకొంది. ఈ ఫలితాలు పార్లమెంటు ఎగువ సభలో రాజకీయ సమీకరణాలను గణనీయంగా మార్చనున్నాయి. ఏపీ, కర్ణాటక, గుజరాత్ వంటి అత్యంత కీలక రాష్ట్రాల నుంచి నాలుగేసి స్థానాలు ఖాళీ అయ్యాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్‌ల నుంచి మూడు, జార్ఖండ్ నుంచి రెండు చొప్పున స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది.

ఈ పరిణామాల మధ్య కాంగ్రెస్ బిగ్ షాక్ తగలడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు నామినేట్ అయిన మీనాక్షి నటరాజన్ దాఖలు చేసిన నామినేషన్ పత్రాలు తిరస్కరణకు గురి కావడం చర్చనీయాంశమైంది. దీనిపై కాంగ్రెస్ ప్రతినిధులు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ తో భేటీ అయ్యారు. తమ అభ్యంతరాలను వ్యక్తం చేశారు.

Big political developments loom as AICC Top leadership convenes Urgent Meeting in Delhi on June 11

ఈసీని కలిసి వారిలో కేసీ వేణుగోపాల్, జైరామ్ రమేష్, రణదీప్ సింగ్ సూర్జేవాలా, వివేక్ తంఖా, దిగ్విజయ్ సింగ్, భూపేష్ బఘేల్, మీనాక్షి నటరాజన్ ఉన్నారు. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 33ఏను అభిషేక్ సింఘ్వీ ఉదహరించారు. కోర్టు ద్వారా అభియోగాలు నమోదై, రెండేళ్లకు పైగా శిక్ష పడే అవకాశం ఉన్న కేసుల్లో మాత్రమే సమాచారం వెల్లడించాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. మీనాక్షి నటరాజన్ విషయంలో కోర్టు ఎలాంటి అభియోగాలను నమోదు చేయలేదని, ఆమెకు కోర్టు ముందు హాజరు కావాలని మాత్రమే నోటీసులందాయని ఆయన తెలిపారు.

ఈసీ వైఖరిని తప్పుపడుతూ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా నిరసనలను నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీనిపై చర్చించడానికి అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చింది. గురువారం ఢిల్లీలోని ఇందిరా భవన్‌లో ఈ భేటీ ఏర్పాటైంది. ఈ సమావేశంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, ఇన్ ఛార్జీలు పాల్గొననున్నారు. అలాగే.. అన్ని రాష్ట్రాల ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులకూ పిలుపు అందింది. ఈ సమావేశానికి హాజరు కావాలని ఆదేశించింది పార్టీ హైకమాండ్.

ఈసీ అనుసరిస్తోన్న వైఖరితో పాటు దేశంలో నెలకొన్న ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చించడానికి ఈ భేటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఏఐసీసీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఈ కీలక సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్ పర్సన్ సోనియా గాంధీ, ప్రధాన కార్యదర్శులు, సీడబ్ల్యూసీ సభ్యులు ఇందులో పాల్గొననున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+