హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ కార్పోరేట్ వ్యూహం: టిడిపి, అవిశ్వాసంపై సవాల్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Yanamala Ramakrishnudu
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డితో సంబంధాలు ఉన్న కార్పోరేట్ సంస్థల యాజమాన్యాలు పార్టీలలో నేతల ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నాయని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు సోమవారం అన్నారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో లబ్ధి పొందిన కంపెనీలు వైయస్ జగన్‌కు సహకరిస్తున్నాయని ఆరోపించారు.

పార్టీ ఫిరాయింపులకు జగన్‌తో సంబంధమున్న కార్పోరేట్ కంపెనీలే కారణమన్నారు. ఫిరాయింపులకు సంబంధించిన చంచల్‌గూడ జైలు నుంచే జగన్ వ్యూహ రచన చేస్తున్నారని మండిపడ్డారు. పార్టీ ఫిరాయింపులకు అవసరమైన డబ్బును వైయస్ వల్ల లబ్ధి పొందిన పారిశ్రామికవేత్తలు సమకూర్చుతున్నారన్నారు. టిడిపి అధికారంలోకి వస్తే అవినీతి సొమ్మును పేదలకు పంచుతామనే భయంతో వారు జగన్‌కు సహకరిస్తున్నారన్నారు.

అవిశ్వాసంపై సవాల్

కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీల మధ్య ఎంపి సబ్బం హరి మధ్యవర్తిత్వం వహిస్తున్నారని టిడిపి నేత పెద్దిరెడ్డి ఆరోపించారు. జగన్ పార్టీకి అనుకూలంగా బహిరంగంగా సబ్బం మాట్లాడుతున్నా కాంగ్రెసు ఆయనపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. సహకార ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసు వెనుకబడిందన్నారు. జగన్ పార్టీ నేత మైసూరా రెడ్డికి అవిశ్వాసానికి, విశ్వాసానికి తేడా తెలియకపోవడం సిగ్గు చేటు అన్నారు.

జగన్ పార్టీ కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొట్టాలని భావిస్తే టిడిపికి మద్దతిచ్చే ఎమ్మెల్యేలతో కూడిన లేఖను గవర్నర్‌కు ఇవ్వాలని సవాల్ విసిరారు. అవిశ్వాసం పెట్టినంత మాత్రాన ప్రభుత్వం పడిపోదన్న కనీస అవగాహన జగన్ పార్టీకి లేకపోవడం దారుణం అన్నారు. ఎమ్మెల్యేలు గవర్నర్ ముందుకొస్తే తాము వచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. కాంగ్రెసుకు లాభం చేయాలని లేదా ఓటమి భయంతోనో జగన్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదన్నారు.

English summary
Telugudesam Party leader Peddi Reddy challenged YSR Congress Party on No Confidence Motion.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X