విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వెళ్లొచ్చు: లగడపాటికి పొన్నం: ఎదురుపడ్డా మౌనమే

By Srinivas
|
Google Oneindia TeluguNews

Lagadapati Rajagopal - Ponnam Prabhakar
విజయవాడ: తెలంగాణ రాష్ట్రం ఇష్టం లేని నేతలు కాంగ్రెసు పార్టీ నుండి బయటకు వెళ్లి పోవచ్చునని కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ ఆదివారం అన్నారు. ఆదివారం ఆయన మాజీ హోంమంత్రి, ప్రత్యేకాంధ్ర ఉద్యమ నాయకుడు వసంత నాగేశ్వర రావును ఐతవరం గ్రామంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పొన్నం విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా ఉందని చెప్పారు.

సీమాంధ్ర పెట్టుబడిదారులు ఎంతోకాలం తెలంగాణ ఏర్పాటును అడ్డుకోలేరన్నారు. తమ పోరాటం కేవలం సీమాంధ్ర పెట్టుబడి దారులపైనేనని, ప్రజలపై కాదని ఆయన స్పష్టం చేశారు. ఢిల్లీ పెద్దలను సీమాంధ్ర నేతలు డబ్బు సంచులతో మేనేజ్ చేస్తున్నారన్న ఆరోపణలు తనవి కావని, తాను ఆ విధమైన వ్యాఖ్యలు ఎప్పుడూ చేయలేదని పొన్నం అన్నారు. కాంగ్రెస్ అధిష్ఠానంపై తమకు పూర్తి స్థాయి నమ్మకం ఉందని చెప్పారు.

రాష్ట్ర విభజన జరుగుతుందన్నారు. నీటి వనరుల పంపిణీ, ఆర్థిక అంశాలను ప్రజాస్వామ్య పద్ధతిలో పరిష్కరించుకోవాలన్నారు. అంబేద్కర్ వంటి మేధావులే చిన్న రాష్ట్రాల వల్ల అభివృద్ది జరుగుతుందని చెప్పగా ధన మద బలంలో ఎంపీలైన కొందరు ఆయన వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారన్నారు. ఉద్యమాలు హుందాగా, ప్రజలు హర్షించే విధంగా ఉండాలి తప్ప బట్టలు విప్పి రోడ్లుపై తిరుగుతూ, పార్లమెంట్ సభ్యత్వానికే మచ్చ తెచ్చే విధంగా ప్రవర్తించడం సరికాదని పరోక్షంగా ఎంపి లగడపాటి రాజగోపాల్‌పై మండిపడ్డారు.

అఖిల పక్ష సమావేశం అయిన మరుక్షణం నుంచి తెలంగాణకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత కాంగ్రెస్ పైనే ఉందన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీతో కలుస్తారా అని ప్రశ్నిస్తే.. తెలంగాణలో అసలు ఆ పార్టీనే లేదన్నారు. రాష్ట్ర విభజనకు ఆంధ్ర ప్రజలు మనస్పూర్తిగా కృషి చేయాలని కోరారు. కాగా, హోటల్ ఐలాపురం వద్ద లగడపాటి, పొన్నం ఒకరికొకరు ఎదురుపడ్డారు. అయినా వారిరువురూ పలకరించుకోలేదు.

English summary
Karimnagar MP Ponnam Prabhakar met former minister and Jai ANdhra leader Vasantha Nageshwar Rao.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X