• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

రైలులో ఎమ్మెల్యే భార్యకే దిక్కులేదు, అసభ్యప్రవర్తన

By Pratap
|
Bihar Map
పాట్నా: రైలు ప్రయాణంలో శాసనసభ్యుడికి, ఆయన కుటుంబ సభ్యులకే దిక్కు లేదు, ఇక సామాన్యుల సంగతి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. బిజెపి ఎమ్మెల్యే శివేష్‌కుమార్ దంపతులపై రైల్వే సిబ్బంది దౌర్జన్యం చేయడంతో ఆరు నెలల చిన్నారితో సహా దంపతులిద్దరూ గాయపడ్డారు. ఈ సంఘటనలో ఇద్దరు రైల్వే సిబ్బందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సంఘటనలో ఐదుగురు రైల్వే సిబ్బందిని సస్పెండ్ చేసినట్టుగా తూర్పు మధ్య రైల్వే ప్రకటించింది.

సోమవారంలోగా నివేదిక సమర్పించాలని దర్యాప్తు బృందాన్ని ఆదేశించింది. కేంద్ర మాజీ మంత్రి మునిలాల్ కుమారుడైన శివేష్‌కుమార్ బీహార్‌లోని భోజ్‌పూర్ జిల్లా ఏజియాన్ నియోజకవర్గం ఎమ్మెల్యే, తన భార్య, ఆరు నెలల చిన్నారి తో కలిసి ఒక శుభకార్యంలో పాల్గొనేందుకు బయలుదేరిన ఆయన పాట్నా జంక్షన్‌లో దానాపూర్-హౌరా(సంపూర్ణ క్రాంతి) ఎక్స్‌ప్రెస్ ఎక్కారు.

శుక్రవారం రాత్రి రాజేంద్రనగర్‌లో ఇదే కోచ్‌లోకి 17మంది రైల్వే టీటీఈలు, ఇతర సిబ్బంది ఎక్కారు. శివేష్‌కుమార్ దంపతుల ఎదురుగా ఉన్న బెర్త్‌లు ఎంపీ పేరిట రిజర్వ్ అయ్యాయి. అయితే, ఖాళీగా ఉన్న ఆ బెర్త్‌ల్లో రైల్వేసిబ్బంది కూర్చున్నారు. ఎమ్మెల్యే, ఆయన భార్యతో వారిలో కొందరు అమర్యాదగా ప్రవర్తించారు. బెంగాల్‌లో శిక్షణకు బయలుదేరిన వీరు బోగీలో తమ ఎదురుగా ఉన్న శివేష్ భార్య గురించి అసభ్యంగా మాట్లాడటం ప్రారంభించారు. అలా చేయొద్దని ఎమ్మెల్యే భార్య కోరినా పట్టించుకోలేదు.

విధుల్లో టీటీఈ జితేంద్రసింగ్‌కు ఆమె ఫిర్యాదు చేశారు. ఈ సమయంలో తాము ఎవరినీ ఇకపై ఇబ్బంది పెట్టబోమని రైల్వే సిబ్బంది హామీ ఇచ్చారు. కానీ, రైలు పాట్నా సాహెబ్ స్టేషన్ వచ్చేలోగా వీరంతా ఎమ్మెల్యే దంపతుల ఎదురుగానే మందు కొట్టడం ప్రారంభించారు. దీన్ని అడ్డుకున్న ఎమ్మెల్యేపై అల్లరిమూక దాడి చేసింది.

రైలు ఖుస్రూపూర్ స్టేషన్ వచ్చేటప్పటికి, హెల్ప్‌లైన్ హెచ్చరికలతో ఎమ్మెల్యే ఉన్న బోగీలోకి కొంతమంది పోలీసు సిబ్బంది వచ్చారు. లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఆరోపణలున్న పంకజ్‌కుమార్ సిన్హా (ముజఫర్‌పూర్ టీటీఈ), సౌరవ్‌సింగ్(బుకింగ్ క్లర్క్, రాజేంద్ర నగర్)లను అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన వారు తప్పించుకున్నారు. భక్తియార్‌పూర్ వద్ద అదనపు బలగాలను రప్పించి, గాలించినా ఫలితం లేకపోయింది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Taking a serious view of some railway employees manhandling and roughing up BJP MLA from Agiaon in Bhojpur district, Shivesh Kumar and his wife on the running Danapur-Howrah Express on Friday night, the railway administration has suspended five railway employees belonging to both Danapur and Sonepur divisions of East Central Railway (ECR). Railways has also decided to hold an identification
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more