కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విషాదం: శవమై తేలిన ఇంజనీర్ విజయ్ కుమార్

By Pratap
|
Google Oneindia TeluguNews

Karimnagar District
కరీంనగర్: శ్రీరాంసాగర్ వరద కాలువ (ఎస్ఆర్‌ఎస్‌పి కెనాల్) సోమవారం గల్లంతైన ఇంజనీర్ విజయ్‌కుమర్ మృతదేహం లభ్యమైంది. హుజూరాబాద్ మండలం సింగాపూర్ దగ్గర విజయ్‌కుమార్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.

ఎస్ఆర్ఎస్పీ డీఈ విజయ్‌కుమార్ సోమవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతం లో మండలంలోని కేశవపట్నం గ్రామ సరిహద్దు సైదాపూర్ మండలం సోమారం మధ్య గల ప్రధాన కాకతీయ కాలువలో పడి అదృశ్యమయ్యారు. విధి నిర్వహణలో విజయ్‌కుమార్ ప్రధాన కాకతీ య కాలువ వెంట సిబ్బందితో పర్యవేక్షణ నిర్వహించారు. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో కారును ఎస్కే ఫ్ వద్ద ఆపి సిబ్బందితో కాసేపు నిద్రపోయారు.

శంకరపట్నం, వీణవంక మండలాల రైతులు నీటిని దొంగతనంగా తరలిస్తున్నారనే అనుమానంతో విజయ్‌కుమార్ సిబ్బందితో ఎస్కేఫ్ వద్ద కాపలాగా ఉన్నారు. తెల్లవారేసరికి విజయ్‌కుమార్ కారులో లేకపోవడంతో సిబ్బంది ఎస్సారెస్పీ ఎస్ఈ రుక్మారెడ్డికి సమాచారం అందించారు. దీంతో ఆయన సిబ్బందితో ప్రధాన కాకతీయ కాలువకు సంబంధించిన ఎస్కేఫ్ వద్దకు వచ్చి అదృశ్యమైన విజయ్‌కుమార్ ఆచూకీ కోసం గాలించారు.

పెద్ద ఎత్తున ఎస్సారెస్పీ అధికారులు 3గంటలకు పైగా ప్రధాన కాకతీయ, ఉప కాలువల వెంట గాలించినా విజయ్‌కుమార్ ఆచూకీ లభించలేదు. అధికారులు విజయ్‌కుమార్ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ఇంట్లో ఉన్నారా? లేరా అని నిర్థారించగా రాలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో ఎస్సారెస్పీ అధికారులు ఆందోళనకు గురయ్యారు.

English summary
Missing SRSP DE Vijay kumar dead body has been found at Singapur village of Karimnagar district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X