షర్మిలకు ఆపరేషనే జరగలేదు, జగన్ కోసం..: గాలి

కుడికాలికి దెబ్బ తగిలిందని మొదట చూపించినవారు, జైలులో జగన్‌ను కలిసి తిరిగి వచ్చేటప్పుడు ఎడమ కాలికి దెబ్బ తగిలినట్లుగా చూపించారని ఆయన అన్నారు. షర్మిలకు శస్త్రచికిత్స జరిగిందనేది అంతా నాటకమేనని ఆయన అన్నారు. జగన్‌కరు బెయిల్ వస్తుందని భావించి దెబ్బ పేరుతో షర్మిల పాదయాత్రను హడావిడిగా ఆపించేశారని ఆయన అన్నారు.
వైయస్ జగన్‌కు బెయిల్ రాకపోవడంతో తిరిగి షర్మిల చేత పాదయాత్రను చేయిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. వైయస్ జగన్ కుటుంబంలో ఆధిపత్య పోరు అప్పుడే ప్రారంభమైందని చెప్పడానికి ఇదే నిదర్శనమని ఆయన అన్నారు. షర్మిలకు నిజంగానే దెబ్బ తగిలి ఉంటే సాక్షి మీడియా పదే పదే చూపించి ఉండేదని, కానీ మౌనంగా ఉండిపోయిందని ఆయన అన్నారు. దీన్ని బట్టే అనుమానాలు కలుగుతున్నాయని ఆయన అన్నారు.
షర్మిల తన పాదయాత్రను బుధవారం తిరిగి ప్రారంభించిన విషయం తెలిసిందే. షర్మిల డిసెంబర్ 15వ తేదీన తన పాదయాత్రను రంగారెడ్డి జిల్లాలో ఆపేశారు. కాలికి గాయం కావడంతో ఆమె అర్థాంతరంగా ఈ పాదయాత్రను నిలిపేశారు. ఆ తర్వాత అపోలో ఆస్పత్రిలో ఆమెకు శస్త్రచికిత్స జరిగింది.












Click it and Unblock the Notifications