వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వీరప్పన్ అనుచరుల క్షమాభిక్ష తిరస్కరణ: ఉరే శిక్షే?

By Srinivas
|
Google Oneindia TeluguNews

Veerappan
న్యూఢిల్లీ: గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ నలుగురు అనుచరులు పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తిరస్కరించారు. ప్రస్తుతం వారు కర్నాటకలోని హిండలగా జైల్లో జ్ఞాన ప్రకాశం, సియోన్, మాడయ్య, జితేందర్‌లు శిక్ష అనుభవిస్తున్నారు. 1993లో కర్నాటక, తమిళనాడు సరిహద్దు ప్రాంతాల్లో పాలార్ వద్ద మందు పాతరను పేల్చారు. ఈ ఘటనలో 21 మంది పోలీసులు మృతి చెందారు.

ఈ కేసుకు సంబంధించి సుప్రీం కోర్టు వీరికి మరణ శిక్ష విధించింది. తమకు క్షమాభిక్ష పెట్టాలని వారు 2004లో రాష్ట్రపతికి విజ్ఞప్తి చేసారు. వారి విజ్ఞప్తిని రాష్ట్రపతి తిరస్కరించారు. దీంతో పార్లమెంటు దాడి ఘటనలో ఉరిశిక్ష పడిన అఫ్జల్ గురు తర్వాత వరుసలో వీరే ఉన్నట్లుగా కనిపిస్తోంది. గతంలో ఈ నిందితులకు కింది కోర్టు జీవిత ఖైదు శిక్షను విధించింది. అయితే, వీరు దానిని తగ్గించాలంటూ సుప్రీం కోర్టుకు వెళ్లారు. అక్కడ మరణ శిక్ష పడింది.

2004 నుంచి పలువురు రాష్ట్రపతులు వచ్చిపోయినా, ఇన్నాళ్లకు ఆయన ఈ ఫైల్ బూజు దులిపారు. రెండు దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ కేసులో నలుగురు వీరప్పన్ అనుచరులు పెట్టుకొన్న క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించి హోంశాఖకు తిప్పి పంపించారు. ఈ విషయాన్ని వారి తరఫు న్యాయవాది బాలమురుగన్ మీడియాకు ద్రువీకరించారు.

2004 నుంచి వీరి క్షమాభిక్ష పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయి. వీరి పిటిషన్లు తిరస్కరణకు గురైన విషయాన్ని జైలు అధికారులు కుటుంబ సభ్యులకు తెలియజేశారు. తమ వారినీ ఉరి తీసేస్తారేమోనని కుటుంబ సభ్యు లు కలవరపడుతున్నారని మానవ హక్కుల కార్యకర్త ఒకరు వెల్లడించారు.

English summary
It is a coincidence that cannot be overlooked. The 
 
 mercy petitions of four Veerappan associates, 
 
 sentenced to death in a landmine blast case, were 
 
 rejected by President Pranab Mukherjee even as a 
 
 trilingual film based on the forest brigand is going 
 
 to be released this week after a legal battle.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X