నీతి, నిజాయితీలుంటే..: బ్రదర్ అనిల్‌కు విహెచ్ సలహా

రేపు తాను అక్కడ పర్యటిస్తానని చెప్పారు. బాధితులు కోరితే అనిల్ కుమార్ పైన వస్తున్న ఆరోపణలపై స్పందిస్తానని అన్నారు. అనిల్ కూడా తనపై వస్తున్న కబ్జా ఆరోపణలపై ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. నీతి, నిజాయితీ ఉంటే ఆయన వెంటనే స్పందించాలన్నారు. తమకు అన్యాయం జరిగిందని బాధితులు చెబుతున్నారని, వాస్తవాలు లేకుండా ఎవరూ అలా చెప్పరన్నారు. బాధితులను కలిసి విషయం తెలుసుకుంటానని చెప్పారు.
బొత్సకు సూచిస్తా
ఈ నెల 20న సమావేశంలో పార్టీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు తాను సూచనలు చేస్తానన్నారు. రాష్ట్ర నాయకులు సీనియర్ నేతలతో, ఇతర ముఖ్య నేతలతో సమావేశమై పార్టీ పై చర్చించాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు కాంగ్రెసు పార్టీకి సెమీ ఫైనల్ వంటివన్నారు. సుప్రీం కోర్టు తీర్పును తాను స్వాగతిస్తున్నానని చెప్పారు. తీర్పు ద్వారా బిసిలకు న్యాయం జరుగుతుందని, వారికి ప్రాతినిధ్యం వహించే అవకాశం వస్తుందన్నారు. బిసిలు రాజకీయంగా ఎదిగేందుకు ఇది ఉపయోగపడుతుందన్నారు.
ఏఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సమావేశంలో తమ పార్టీ నేతలు బొత్స సత్యనారాయణ, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిలు తెలంగాణ సమస్య తేల్చమని చెప్పినప్పుడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి విదర్భ అనవచ్చునని అన్నారు. తెలంగాణపై కేంద్రమంత్రి శరద్ పవార్ ఏమన్నారో తనకు తెలియదన్నారు.












Click it and Unblock the Notifications