నా పాలనకు క్లింటనే మురిసిపోయాడు: చంద్రబాబు

రుణమాఫీపై మరోసారి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిపై చంద్రబాబు నిప్పులు చెరిగారు. " ఏ పథకం నిలిపివేసి రుణమాఫీ పథకం అమలు చేస్తా''రనే ముఖ్యమంత్రి ప్రశ్నకు ఆయన స్పందిస్తూ - ఈ చేతగానీ ముఖ్యమంత్రికి రుణమాఫీ అమలు చేసి చూపిస్తానని అన్నారు. ఈసారి తమ మద్దతు ఉన్న ప్రభుత్వమే కేంద్రంలో అధికారంలోకి వస్తుందని, అప్పుడు ఢిల్లీని డిమాండ్ చేసి రుణమాఫీ పథకం సాధిస్తానని చెప్పారు. అలాగే రాష్ట్రానికి అవసరమైన పనులూ చేయించుకుంటా'నని వెల్లడించారు. రైతుకు ఇచ్చిన మాటను నిలుపుకొని తీరతానని అన్నారు.
"ఈ ముఖ్యమంత్రికి పరిపాలనేమి తెలుసు? నా పరిపాలన తీరును అధ్యయనం చేసేందుకు నాడు బిల్ క్లింటన్ వారి దేశ గవర్నర్లను పంపించారు. దీపం ఉండగానే ఇల్లు చక్క బెట్టుకోవాలన్న యావతో కిరణ్ సాగుతున్నారు. ఇద్దరు తమ్ముళ్లతో దుకాణం తెరిచారు. నీలం తుపాను వస్తే ఇప్పటివరకు రైతాంగానికి సాయం అందించలేదు. తొమ్మిదిన్నర ఏళ్ల పాటు కుటుంబాన్ని కూడా వదిలేసి ర్రాష్టాభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమించాను. ఈ రోజున కుక్కల చింపిన విస్తరిలా మారిపోవడంతో మీకంటే ఎక్కువ నాకు భాదేస్తోంది'' అని అన్నారు.
కాంగ్రెస్ హయాంలో రైతులు రెండు విధాలుగా దెబ్బతింటున్నారని, ఒకవైపు పంటలు సాగు చేసుకొనేందుకు ప్రభుత్వం కాలువలకు నీళ్లు ఇవ్వకుండా కన్నీరు పెట్టిస్తుందని విమర్శించారు. ప్రకృతి వైపరీత్యాలు ముప్పేట దాడి చేస్తూ కోలుకోకుండా చేస్తున్నాయ'ని ఆవేదన వ్యక్తం చేశారు. గజదొంగలు, దోపిడి దొంగలను ప్రజల్లోకి వదిలిన కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెసు చిత్తుచిత్తు చేయాలని పిలుపునిచ్చారు. తమ పార్టీకి 42 మంది ఎంపీలను అందిస్తే ఢిల్లీలో చక్రం తిప్పి మహిళల కష్టాలు తీరుస్తానని హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications