సినిమా బాగా లేకున్నా చూస్తారు: షర్మిల యాత్రపై జానా

Jana Reddy
హైదరాబాద్: సినిమా బాగా లేకపోయినా కొంత మంది చూస్తారని, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు షర్మిల పాదయాత్రకు లభిస్తున్న ప్రతిస్పందన అలాంటిదేనని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె. జానా రెడ్డి అన్నారు. తెలంగాణ అంశం పూర్తి కాకుండా తాను ముఖ్యమంత్రి పదవి తీసుకోనని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. తెలంగాణ ఇచ్చి, ముఖ్యమంత్రి పదవి ఇస్తానంటే తీసుకోవడానికి తనకు అభ్యంతరం లేదని ఆయన అన్నారు.

ముఖ్యమంత్రి పదవి కోసం, శానససభ టికెట్ కోసం తాను ఎవరినీ జోకలేదని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి అయినవారు కాంగ్రెసు పార్టీ అధిష్టానం వద్ద పైరవీ చేసుకుని ఉంటారని ఆయన వ్యాఖ్యానించారు. త్వరలోనే పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని ఆయన చెప్పారు. రెండు నెలల్లో రిజర్వేషన్లు, ఇతర ప్రక్రియ పూర్తి చేసి ఎన్నికల సంఘానికి నివేదిక సమర్పిస్తామని చెప్పారు.

స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును శిరసా వహిస్తామని జానా రెడ్డి చెప్పారు. కొత్త మున్సిపాలిటీల ఏర్పాటు వల్ల 150 పంచాయతీలు తగ్గాయని ఆయన చెప్పారు. మైనారిటీలకు రిజర్వేషన్లు చట్టంలో లేవని స్పష్టం చేశారు. 2001 జనాభా లెక్కల ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తామని అన్నారు. గతంలో ఉన్న రిజర్వేషన్ విధానాన్నే అమలు చేస్తామని చెప్పారు.

బిసీలకు 34 శాతం, ఎస్సీలకు 18.3 శాతం, ఎస్టీలకు 8.25 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తామని వివరించారు. మతపరమైన రిజర్వేషన్లు లేవని ఆయన చెప్పారు. పంచాయతీ ఎన్నికలు వెంటనే జరపడానికి ప్రయత్నం చేస్తామని జానా రెడ్డి చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+