పంచాయతీ ఎన్నికలకు సుప్రీం పచ్చజెండా

ప్రభుత్వం తాజా రిజర్వేషన్ల విధానంలోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించుకునేందుకు ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం సోమవారం తీర్పును ఇచ్చింది. సుప్రీం కోర్టు మధ్యంతర ఉత్తర్వులతో పంచాయతీ ఎన్నికలకు అడ్డు తొలగినట్లయింది. ప్రభుత్వం ప్రస్తుతం 34 శాతం బిసిలకు, ఎస్సీలకు 18.3 శాతం, ఎస్టీలకు 8.25 శాతం రిజర్వేషన్‌లతో ఎన్నికలకు వెళ్లే అవకాశముంది. సుప్రీం తీర్పుతో 60.5 శాతం రిజర్వేషన్‌లతో ప్రభుత్వం ఎన్నికలకు వెళ్లనుంది.
రిజర్వేషన్లు కేవలం విద్యా, ఉపాధి అవకాశాలకు మాత్రమే వర్తిస్తాయని కోర్టు చెప్పింది. వీటికి వర్తించవని తెలిపింది. కాగా సుప్రీం కోర్టు తీర్పును కాంగ్రెసు, తెలుగుదేశం తదితర పార్టీలు స్వాగతించాయి. పంచాయతీ ఎన్నికలపై సుప్రీం కోర్టు స్టే ఎత్తివేయడం శుభ పరిణామమని మాజీ మంత్రి, కాంగ్రెసు పార్టీ సీనియర్ ఎమ్మెల్యే జెసి దివాకర్ రెడ్డి సోమవారం అన్నారు.
సుప్రీం కోర్టు తీర్పుపై తెలుగుదేశం పార్టీ హర్షం వ్యక్తం చేసింది. ప్రభుత్వ అసమర్థత వల్లే స్థానిక సంస్థల ఎన్నికలు ఆలస్యమయ్యాయని టిడిపి ఆరోపించింది. ఎన్నికలు జరగకపోవడం వల్ల కేంద్రం నుండి రావాల్సిన వేల కోట్ల రూపాయలు ఆగిపోయాయని అన్నారు. సుప్రీం తీర్పు పైన సర్పంచుల సంఘం హర్షం వ్యక్తం చేసింది. బిసి సంఘం కృష్ణయ్య సుప్రీం తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications