రికార్డు కోసం కాదు: షర్మిల, చంద్రబాబుకు ఊరట

నాన్నగారి ఆశీస్సులు, దేవుని దయతో చేస్తున్న తాను చేస్తున్న పాదయాత్ర 1000 కిలోమీటర్లు చేరుకుందని షర్మిల చెప్పారు. తాను పాదయాత్ర చేసిన అన్ని గ్రామాల్ోల ప్రజల కన్నీళ్లు, కష్టాలే దర్శనమిచ్చాయని ఆమె అన్నారు. అంత బాధలో కూడా ప్రజలు రాజన్న రాజ్యం రావనలి, జగనన్న ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని ఆమె అన్నారు. కొండప్రోల్‌లో వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహ స్థాపనకు స్థలం ఇచ్చిన సూర్యనారాయణ దంపతులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
చంద్రబాబుకు ఊరట
గుంటూరు జిల్లాలో పాదయాత్ర చేస్తున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి ఎన్నికల ప్రవర్తనా నియమావళి నుంచి ఊరట లభించింది. ఈ నెల 19వ తేదీ నుంచి 21వ తేదీ వరకు గుంటూరు జిల్లాలో ఉండేందుకు ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది.
ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రానికి దగ్గరలో ఉండకూడదని ఎన్నికల సంఘం చంద్రబాబును ఆదేశించింది. పాదయాత్ర లేదా ఏ విధమైన ప్రచారం చేయరాదని స్పష్టం చేసింది. ప్రత్యేకాధికారి పరిశీలనలో వీడియోగ్రఫీ జరపాలని జిల్లాకు అధికారులకు ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.












Click it and Unblock the Notifications