సెంటిమెంట్ పండినా: చెప్పలేక 'జగన్'? ఎదురు దాడే
హైదరాబాద్: కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రత్యర్థుల ఆరోపణలను ఘాటుగా తిప్పికొట్టలేక పోతోందా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. కాంగ్రెసు నుండి వేరుపడి జగన్ పార్టీ స్థాపించినప్పటి నుండి ఆయనపై అవినీతి ఆరోపణలు మిన్నంటాయి. ఎంతోకాలంగా తెలుగుదేశం పార్టీ దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి, జగన్, కాంగ్రెసు అవినీతిపరులంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు.
కానీ, ఇటీవల తెలుగుదేశం పార్టీకి దాదాపు అన్ని పార్టీలు తోడయ్యాయి. పార్టీని వీడటంతో అధికార కాంగ్రెసు, తెలంగాణలో బలోపేతం కోసం ప్రయత్నించడంతో తెలంగాణ రాష్ట్ర సమితిలు జగన్‌కు గురిపెట్టాయి. ఇటీవల వరకు జగన్ అవినీతిపై మౌనం పాటించిన బిజెపి గత కొద్దిరోజులుగా మిగిలిన పార్టీల కంటే ఘాటుగా విమర్శలు గుప్పిస్తోంది. అయితే, జగన్ భవిష్యత్తులో బిజెపికి ఎట్టి పరిస్థితుల్లోనూ చేయందించే అస్కారం లేదనే ఉద్దేశ్యంతోనే వారు మాటల దాడికి దిగినట్లుగా చెబుతున్నారు.
సెంటిమెంట్ పండిస్తూ లబ్ధి పొందుతున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ విపక్షాల విమర్శలను అంతేస్థాయిలో తిప్పికొట్టలేక పోతుందనే విమర్సలు వినిపిస్తున్నాయి. జగన్ అవినీతిపరుడు అని టిడిపి, టిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెసు వంటి పార్టీలు గొంతెత్తుతున్నాయి. అయితే, జగన్ పార్టీ మాత్రం వారిపై ఎదురు దాడి చేయడం మినహా ఆరోపణలపై స్పష్టమైన వివరణ ఇవ్వలేకపోతోందని అంటున్నారు.
అవినీతిపై ప్రశ్నిస్తే రాజకీయాల్లో నీతిమంతులెవరనే అభిప్రాయాలు కూడా జగన్ పార్టీ నేతలు వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయని అంటున్నారు. తెలంగాణవాదంతో కెసిఆర్, అధికారంలో ఉన్నప్పుడు బాబు ఆస్తులు కూడబెట్టాడనే విమర్శలు వస్తున్న ప్రతి సందర్భంలో ఆ పార్టీ నేతలు ధీటుగా స్పందిస్తారు. సవాళ్లు విసురుతారు. కానీ, జగన్ విషయంలో మాత్రం ఆ పార్టీ నుండి స్పందన అంతంత మాత్రమే అంటున్నారు.
అవినీతి ఆరోపణలపై స్పష్టత ఇవ్వడం మాట అటుంచి వారు ఎదురుదాడికి దిగేందుకే ఎక్కువగా ఆసక్తి కనబరుస్తుంటారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి సెంటిమెంట్ కారణంగా ప్రస్తుతం జగన్ హవా వీస్తోందని కానీ, భవిష్యత్తులో ఆ సెంటిమెంట్ ప్రభావం తగ్గితే జగన్ పార్టీకి కష్టాలు తప్పవంటున్నారు. ఇప్పటికే గతంలో ఉన్నంత హవా ఇప్పుడు కనిపించడం లేదని అంటున్నారు.

వైయస్ జగన్ పైన వస్తున్న అవినీతి ఆరోపణలను ఘాటుగా తిప్పికొట్టలేకపోతుందనే వాదనలు వినిపిస్తున్నాయి.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ బలోపేతం కోసం నడుంబిగించిన షర్మిల పైన, ఆమె భర్త బ్రదర్ అనిల్ కుమార్‌ల పైనా విమర్శలు ఇటీవల జోరందుకున్నాయి.

మొన్నటి వరకు జగన్‌పై ఆరోపణల విషయంలో వెనుకంజలో ఉన్న బిజెపి ఇటీవల ఒక్కసారిగా మిగిలిన పార్టీల కంటే ఘాటుగా స్పందిస్తోంది.

జగన్ పార్టీ నేతలు ఎదురుదాడితో మాత్రమే ఆరోపణలను తిప్పికొట్టే ప్రయత్నాలు చేస్తోందని అంటున్నారు.

బాబు, కెసిఆర్‌ల పైన ఆరోపణలు వస్తే ఆ పార్టీ నేతలు ధీటుగా...
అవినీతి ఆరోపణలపై విమర్శలను ఘాటుగా తిప్పికొడితే తప్ప భవిష్యత్తులో పార్టీని గట్టెక్కించడం కష్టమనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇటీవల జగన్ సోదరి షర్మిల పార్టీ బలోపేతం కోసం మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర చేపట్టడంతో షర్మిల, బ్రదర్ అనిల్ కుమార్‌ల పైనా అవినీతి ఆరోపణలు జోరుగా వస్తున్నాయని, వాటిని కూడా తిప్పికొట్టడంలో విఫలమయ్యారని అంటున్నారు. షర్మిల, అనిల్‌లపై వచ్చిన ఆరోపణలపై ఆదివారం మాట్లాడిన రోజు తిప్పికొట్టడం మాట అటుంచి ఎదురుదాడికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని అంటున్నారు. దాదాపు పార్టీ నేతలందరి పరిస్థితి ఇలాగే ఉందని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications