హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అస్సాంలో ఆంధ్రా ఇంజనీర్ కిడ్నాప్: బోడో రెబెల్స్ పనే!

By Srinivas
|
Google Oneindia TeluguNews

Paidi Raju
హైదరాబాద్/గౌహతి: అస్సాంలో ఇంజనీర్‌గా పని చేస్తున్న మన రాష్ట్రానికి చెందిన పైడి రాజు అనే ఇంజనీరును బోడో ఉగ్రవాదులు అపహరించినట్లుగా తెలుస్తోంది. విశాఖపట్నం జిల్లాకు చెందిన పైడి రాజు అస్సాంలోని బాక్షా జిల్లాలో పని చేస్తున్నాడు. ఆయనను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించినట్లుగా ఆయన పని చేస్తున్న కంపెనీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే, బోడో రెబల్స్ అపహరించి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఇందుకు సంబంధించి కంపెనీకి చెందిన వారితో పాటు స్థానికులను పోలీసులు విచారించారు. కంపెనీ మేనేజర్ తమకు ఫోన్ చేసి తమ అబ్బాయిని ఎవరో కిడ్నాప్ చేశారని సమాచారం అందించారని విశాఖపట్నంలోని పైడి రాజు తల్లిదండ్రులు చెప్పారు. ఫోన్ ద్వారా తమకు సమాచారం అందించాడని, కిడ్నాప్ చేసిన వారు డబ్బులు డిమాండ్ చేస్తున్నారని, డబ్బులు ఇచ్చి విడుదల చేస్తామని హామీ ఇచ్చారని చెప్పినట్లుగా తెలుస్తోంది.

తన తనయుడు పైడి రాజును విడిపించేలా చర్యలు చేపట్టాలని తండ్రి చింతల అప్పారావు కేంద్రమంత్రి దగ్గుపాటి పురేంధేశ్వరిని కోరారు. ఆదివారం అప్పారావు మాట్లాడుతూ... తన తనయుడు పైడి రాజు ఇంటికి వచ్చాడా? అని మేనేజర్ అడిగాడని, దాంతో తాను వెంటనే తన తనయుడికి ఫోన్ చేశానని, ఫోన్ స్విచ్చాఫ్ వచ్చిందని, ఆ తర్వాత మళ్లీ కంపెనీ మేనేజర్ ఫోన్ చేసి... తన తనయుడు కిడ్నాప్‌కు గురైనట్లుగా చెప్పారన్నారు.

26 ఏళ్ల పైడి రాజు బి.శీనయ్య అండ్ కంపెనీలో క్వాలిటీ కంట్రోల్ ఇంజనీరుగా పని చేస్తున్నాడు. అతను అస్సాంలోని పుట్టుమోరి నది సమీపంలోని సైట్‌లో పని చేస్తున్నాడు. గత నాలుగేళ్లుగా అతను దేశంలోని వివిధ ప్రాంతాలలో పని చేశాడు. గత ఏడాదిన్నరగా రాజు పవర్ గ్రిడ్ కార్పేరేషన్ ఆఫ్ ఇండియా సైట్‌లో పని చేస్తున్నారని చెప్పాడు.

English summary
Suspected rebels of the outlawed National Democratic Front of Bodoland on Friday night abducted a senior engineer from Visakhapatnam from the Dhekia Puta area of Baksha district in the Bodoland Territorial Council in Assam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X