పిఎంని చేయమన్నమాయావతి, తెలంగాణే కాదు విదర్బ

వచ్చే ఎన్నికల్లో పార్టీకి భారీ విజయాన్ని సాధించి పెట్టాలన్నారు. అప్పుడు తాను ప్రధాని హోదాలో ఎర్రకోట నుంచి స్వాతంత్ర దినోత్సవ ప్రసంగం చేస్తానంటూ జోస్యం చెప్పారు. వచ్చే స్వాతంత్ర దినోత్సవానికి తాను ఎర్రకోట నుండి ప్రసంగించాలని, అందుకోసం సార్వత్రిక ఎన్నికల్లో బిఎస్పీ గెలవాలని, అందరూ గట్టిగా కృషి చేయాలన్నారు. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో కొన్ని శక్తులు పార్టీ కేడర్ మనసు మార్చే ప్రయత్నం చేస్తాయని ఆమె హెచ్చరించారు.
అమ్ముడుపోయే వస్తువులు కావద్దని ఆమె కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. ఎస్సీ, ఎస్టీలకు పదోన్నతుల్లో కోటా బిల్లును అడ్డుకోవడానికి కాంగ్రెస్, బిజెపిలు కుట్ర పన్నాయని ఆమె ఆరోపించారు. హెలిస్కాంలో దోషులను కఠినాతి కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు.
తెలంగాణ ఎంతో విదర్భ అంతే
ఈ ర్యాలీలో మాయావతి తెలంగాణతో పాటు విదర్భ ఏర్పాటుపై మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతగా ఉందో మహారాష్ట్రలో విదర్భ ఏర్పాటు చేయాల్సిన అవసరము అంతే ఉందని ఆమె వ్యాఖ్యానించారు. దీనిని తాను కేంద్రం దృష్టికి తీసుకు వెళ్తానని చెప్పారు. తన చేతికి అధికారం వస్తే ప్రత్యేక విదర్భతో పాటు మహారాష్ట్రను మార్చేస్తానన్నారు.












Click it and Unblock the Notifications